మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ. బయ్యారం క్రాస్ రోడ్ లో జాడి మహేష్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న శరణ్య ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ ను తినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ, మండల స్థానిక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరలోని వ్యక్తులను ఆదరించాలని, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పినపాక టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.
Post A Comment: