CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేద ప్రజల కష్టాలు తీర్చడానికి కేరాఫ్ అడ్రస్ "జనసేన" యువజన విభాగం

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గడచిన కొన్ని నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన, మన తేడా లేకుండా ఎవరైనా ఆపదలో ఉన్నారన్న సమాచారం రాగానే అక్కడికి జనసేన పార్టీ యువజన విభాగం అద్యక్షుడు డేగల రామచంద్రరావు లేదా వారి విభాగానికి చెందిన వారు ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ భరోసా ఇవ్వడం తో పాటుగా ఆ కష్టం ఆపద తీరేల తమవంతు కృషి నిర్విరామంగా చేస్తూ పార్టీలకు అతీతంగా పలువురి మన్ననలు పొందడం జరిగింది. దీనిలో భాగంగానే ముఖ్యంగా తలసేమియా వ్యాధి తో భాదపడుతున్న చిన్నారులకు నెల నెల రక్త మార్పిడికి అవసరమైన రక్తాన్ని సేకరించి వారికి అవసరమైన ఇతర మందులను సైతం ఉచితంగా సంకల్ప సేవాసంస్థ ద్వారా ఇప్పించి వారి ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు. ఈ నెల 2 వ తేదీన తమ పార్టీ అధినేత జన్నధినం సందర్బంగా ఖమ్మం జిల్లా కేంద్రం లో రక్తదాన శిబిరం నిర్వహించి 100 మందికి పైగా రక్తదానం చేయించారు. ఈ తరుణంలో ఇటీవలే అశ్వారావుపేట నియోజకవర్గం మరియు అశ్వారావుపేట మండలంలో గల గాండ్ల గూడెం గ్రామానికి చెందిన మాలోత్ రమాదేవి అనే వివాహిత నిరుపేద కుటుంబం, తను కూడా చికిల్ సేమియాతో బాధపడుతుంది పైగా గర్బవతి అయిన ఆమెకు  డెలివరీ అయ్యేవరకు ప్రతీ రోజూ 3000/- రు.ల ఇంజక్షన్ చేస్తూ హిమోగ్లోబిన్ శాతాన్ని అదుపులో ఉంచడానికి ఒక మిషనరీ ఖరీదు 45000/- సైతం అవసరమైన ప్రస్తుతం వైద్యం చేయించుకోవడానికి సరిపడా స్తోమత లేక దాతల సహాయ, సహకారాలు కోరుతూ పత్రికలో వచ్చిన  వార్తకు స్పందిస్తూ స్వయంగా రామచంద్రరావు వారి ఇంటికి వెళ్ళి దైర్యం చెప్పి సోమవారం ఖమ్మం తీసుకుని వెళ్ళి అవసరమైన వైద్యపరీక్షలు చేయించి డెలివరీ అయ్యేవరకు ఇంజక్షన్ ప్రతీ రోజూ ఉచితంగా అందించే విధంగా చేయడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: