CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విభజన హామీల కోసం కృషి చేయండి

Share it:


 *విభజన హామీల కోసం కృషి చేయండి

*ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల బుద్ధి చెప్తారు.

*రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడవలసిన బాధ్యత కేంద్ర మంత్రిదే.

*గిరిజన యూనివర్సిటీకి భూ కేటాయింపు జరగలేదనడం అవాస్తవం.

*సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వానికి మొండిచేయి చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం.

*జాతీయ రహదారిపై ర్యాలీ కేంద్రమంత్రి దిష్టిబొమ్మ దహనం.

*ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్.

*మన్యం మనుగడ ములుగు*

తెలంగాణ యువజన చట్టంలోని హామీలను పక్కాగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కృషి చేయాలని ములుగు జడ్పీ చైర్మన్ కూసుమ జగదీష్ అన్నారు. ఈ మేరకు ములుగు జాతీయ రహదారిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జాతీయ రహదారిపై ర్యాలీ చేసి అనంతరం మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో కలిసి జాతీయ రహదారిపై కేంద్రమంత్రి దిష్టిబొమ్మను దహన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తప్పు పట్టారు ములుగు జిల్లాలో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం చేయలేదనడం సిగ్గుచేటు అని తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని కోవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక రాష్ట్రానికి రావలసిన నిధులు మొండి చేసి చూపిస్తుంటే తెలంగాణ గడ్డమీద పుట్టి మిడిమిడి జ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాష్పాలు చేసే విధంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడం చాలా బాధాకరమని అన్నారు. బిజెపి నాయకులు ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల్లోకి వెళ్తున్నారని అలాంటి చవకపారు వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని,చేస్తే ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని ఒక జాతీయస్థాయి మంత్రిగా ఉంటూ అబద్ధాలు ఆడడం సిగ్గుచేటు అని, ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు తిరిగి పునరుతం అయితే సంచేది లేదని హెచ్చరించారు. భూగర్భ ఇనుము ముడి సరుకు ఎంతో గాను ఉన్న బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం కోసం చేతనైతే కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు, వెంకటాపూర్,ఏటూరు నాగారం మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,రమణారెడ్డి,గడదాసు సునీల్ కుమార్,ములుగు జడ్పిటిసి సకినాల భవాని, గోవిందరావుపేట ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, ములుగు ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, నర్సాపూర్ చైర్మన్ మడుగుల రమేష్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయ్, ములుగు టౌన్ అధ్యక్షులు విజయ్,ములుగు మండల యువజన విభాగం నాయకులు సాగర్,బుర్ర సమ్మయ్య, మల్లారెడ్డి,మురళి, మోహన్,సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

AP

TELANGANA

Post A Comment: