CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు.. పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి వీడాలి...

Share it:

 


మన్యం టివీ దుమ్ముగూడెం::

బయ్యారం ఉక్కు పరిశ్రమ నెలకొల్పటం సాధ్యపడదని ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు  నిరసనగా మండల కేంద్రం లక్ష్మీ నగరం గ్రామంలో ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ  దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియ చేశారు.ఈ సందర్బంగా పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు మాట్లాడుతూ రాష్ట్రం లో నెలకొల్పవలసిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రప్రభుత్వం చేపట్టడం కుదరదని బాధ్యతగల కేంద్రమంత్రి తెలంగాణా రాష్ట్రానికి చెందిన వాడై వుండి కూడా రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు రావని చెప్పడం సిగ్గుమాలిన ప్రకటనలు అని ఇట్లాంటి మాటలు వారి చేతగాని తనానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించటానికి అన్ని వనరులు ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం ఎందుకు ఉక్కుపరిశ్రమ స్థాపించటానికి వెనుకాడుతుందని, ఇక్కడ ఉక్కుపరిశ్రమ స్థాపించడం వలన వేలాదిమందికి ఉపాధి ఉద్యోగాలు పొందే అవకాశాన్ని పోగొడుతున్నారని ,నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టే పనులు కేంద్రప్రభుత్వం చేస్తుందని ఇట్లాంటి దుర్మార్గమైన దిక్కుమాలిన  పాలన అంతమయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని, తెలంగాణ రాష్ట్రం పై కేంద్రప్రభుత్వం కక్షపూరిత ధోరణి వహిస్తూ గతంలో కూడా దాన్యకొనుగోలు విషయం లోకూడా ఇట్లాగే వివక్షత చూపినదని  ఈరాష్ట్ర నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కూడా రాష్ట్ర భవిష్యత్తు పై వారికి ఎటువంటి శ్రద్దలేదని వారు మోడీ అమిత్ షా ల జపంచేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాము దగ్గరనుండి రావలసిన నిధులు తేలేరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, జెడ్పిటిసి సీతమ్మ , సోషల్ మీడియా మండల ఇంచార్జ్ దామెర్ల శ్రీనివాసరావు, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కెల్లా శేఖర్ ఎస్సీ సెల్ అధ్యక్షులు  మోతుకురి శ్రీకాంత్, పార్టీ యూత్ కమిటీ కార్యదర్శి అల్లాడి వెంకటేష్,  పార్టీ మండల నాయకులు మద్ది రాము,  కొత్తూరు సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

AP

TELANGANA

Post A Comment: