CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ములుగు జిల్లాను పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలి

Share it:

 


*ములుగు జిల్లాను  పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలి

*రక్తహీనతను నివారించేందుకు పౌష్టిక ఆహారం అందించాలి.

*గర్భిణీలు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

*తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి.

మన్యం మనుగడ , ఏటూరు నాగారం :

ములుగు జిల్లాను పోషకాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు.

ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాల యంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అధ్యక్షతన జరిగిన  మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాహ్,2022 బతుకమ్మ సంబరాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,

ఐటిడిఎ పివో అంకిత్ లతో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ మహిళా రక్షణ,శిశు,కిషోర్ బాలికల, బరువు పెంచడం,పోషణ సంక్షేమం,జిల్లాలో పోషణ అభియాన్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సందర్భంలో అంగన్వాడీ పిల్లల పోషకాహారం వంటి పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు.ఈ కార్యక్రమం లో భాగంగా అంగన్వాడీ టీచర్లు సాంప్రదాయ ఆహారం ఏర్పాటు చేసి వాటీ విశిష్టతను స్టాల్ ద్వారా ఏర్పాటు చేసి సభ్యులకు వివరించారు.వివిధ రకాల పువ్వులతో బతుకమ్మ లను తయారు చేశారు.ఈ బతుకమ్మలను చైర్ పర్సన్ తిలకించారు.చైర్ పర్సన్  మాట్లాడుతూ.65 % మంది మహిళలు రక్త హీనతో బాధపడుతున్నారని,గర్భిణీ లలో 51% ఈ సమస్య ఎదురుకుంటున్నారని,అన్నారు

మహిళలు ఆకు కూరలు,పౌష్టి కహారం తీసుకోవాలని ఆమె సూచించారు.పుట్టిన పిల్లలకు వెంటనే ముర్రు పాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంద ని పేర్కొన్నారు,పిల్లల ఎదుగుదల ఆరోగ్యానికి పోషకహారం తప్పనిసరని, చిన్నారుల ఆరోగ్యo పై ప్రతేక్య శ్రద్ధ వహించాలని, 1000 రోజుల ప్రణాళిక ఆవశ్యకతను వివరించారు.మహిళల్లో రక్తహీనత నుండి విముక్తి లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని,ఈ దిశగా విజయం సాధిస్తూ ముందుకెళ్లడం అభినందనీయ మని అన్నారు.రక్తహీనత ఉన్న వారికి సరైన పోషకాహారం అందించడం,ఐరన్ మాత్రలు ఇవ్వడం వంటి వాటి ద్వారా రక్తహీనతను అరికట్టవచ్చని ఆమె  తెలిపారు.అడవి తల్లి అందాలను మహిళల గురించి వివరించిన పాటలను డి.డబ్ల్యు.ఓ,సిడిపివోలను,  సూపర్వైజర్లను,అంగన్వాడి టీచర్లను ఆమె అభినందిం చారు.రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సహకారంతో  జిల్లాలో అంగన్వాడి సెంటర్లను నూతన భవనాలను తీర్చిదిద్దుకుంటు న్నామని అన్నారు.జిల్లా కలెక్టర్ వివరించి నట్టుగా జిల్లాలో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించ డానికి ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తామని ఆమె అన్నారు.జిల్లా సంక్షేమ అధికారి చురుకుగా పనిచేస్తున్నారని,ఈ జిల్లాలోని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని ఆమె తెలిపారు.గిరిజన పిల్లల విద్య కోసం ఆశ్రమ పాఠశాలలో, ఆరోగ్య  క్షేమం కోసం పౌష్టికా హారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు.ఈ సమా వేశం లో కలెక్టర్ మాట్లాడుతూ.రక్త హీనత వల్ల మహిళల్లో అనేక దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని అన్నారు.జిల్లాలో 646 అంగన్వాడి సెంటర్లు ఉన్నాయని అన్నారు.జిల్లాలో అంగన్వాడీ సెంటర్లలో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు షహీన్ ఆఫ్రోజ్,కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ,రేవతి,కృష్ణకుమారి,

ఈశ్వరి బాయి,అదనపు కలెక్టర్ రెవిన్యు వై వి గణేష్,ఐటీడీఏ ఏపీవో వసంతరావు,ఎస్ ఓ రాజు కుమార్,ఐటిడిఏ ఈఈ హేమలత,వైద్య అధికారి అప్పయ్య,ఈఈ హేమలత,

సీడీపీఓ హేమలత, మల్లేశ్వరి,

ముత్తమ్మ,జిల్లా కోఆప్షన్ సభ్యురాలు వలియాబి,

జడ్పిటిసి సభ్యురాలు పాయం రమణ,ఏటూరు నాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి, సూపర్వైజర్లు,అంగన్వాడీ టీచర్లు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: