CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వీళ్ళ వడ్డీలకు అంతే లేదు ....ఒక్కసారి అప్పుచేస్తే జీవితాంతం కట్టాల్సిందే.. 10రూ.ల నుండి 15రూ.లవరకు వడ్డీ వసూల్..

Share it:

 


*వీళ్ళ వడ్డీలకు అంతే లేదు

 *ఒక్కసారి అప్పుచేస్తే జీవితాంతం కట్టాల్సిందే..

 *10రూ.ల నుండి 15రూ.లవరకు వడ్డీ వసూల్..

 *పేదలే కాదు, చిరు వ్యాపారులు సైతం అధిక వడ్డీలకు బలి 

 *అవసరం అంటే చాలు అంటగట్టేస్తారు

 *వినాయకపురం లో వెలుగులోకి వచ్చిన ఘటన


 *మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామంలో కాల్ మనీ. ఇప్పుడు వినాయకాపురంలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న అంశం. ఇంతకూ కాల్ మనీ అంటే ఏంటి? ఈ వడ్డీ వ్యాపారం ఎందుకు ఇంత చర్చనీయాంశమైందో తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. అత్యవసర సమయానికి డబ్బు అందించడాన్నే కాల్ మనీ అంటారు. నిజానికి దీన్ని కేవలం ఇంటర్ బ్యాంకింగ్ వ్యవహారాల్లో మాత్రమే అనుసరిస్తారు. బ్యాంకింగ్ పరిభాషలో చెప్పాలంటే నగదు నిల్వలు మెయింటైన్ చేయడానికి ఇతర బ్యాంకులను సర్దుబాటు చేసుకునే విధానం. ఇందులో 15 రోజుల్లోపు ఒకరు మరొకరికి ఇచ్చుకునే స్వల్పకాలిక రుణం. మన వాడుక భాషలో దీన్నే చేబదులు కూడా అనొచ్చు. ఇలా ఇచ్చిన రుణాలకు వడ్డీని వసూలు చేస్తారు. ఎక్కువగా ఈ కాల్ మనీ బ్యాంకుల మధ్య జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు వినాయకపురం లో జరుగుతున్న కాల్ మనీ వ్యవహారం వేరు. సమయానికి డబ్బు అందించే ఫెసిలిటీని  ప్రైవేటు వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీల కోసం వాడుకుంటున్నారు. ఏకంగా వినాయకపురంలో దీన్ని ఓ మాఫియాగా మార్చేశారనే ఆరోపనలు. ఈ కాల్ మనీ టర్నోవర్ ఏడాదికి. 30 నుండి 40లక్షల రూపాయల్లో  ఉంటుందని అంచనా.

*అప్పు ఈ రోజుల్లో సామాన్యులే కాదు.. కాస్త డబ్బున్నవాళ్లు కూడా మోయలేని భారం* :

బ్యాంక్ లోన్ల సంగతి అటుంచితే ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పులు మాత్రం ప్రతి ఒక్కరికీ గుదిబండలా మారతాయి. అసలు కంటే వడ్డీనే మోయలేని భారమవుతుంది. అంతేకాదు కొన్నిసార్లు ప్రాణాలమీదకు తెస్తుంది. ఇందుకు ప్రధాన కారణం కాల్ మనీ మాఫియా. కాల్ మనీ కబంద హస్తాల్లో ఎన్నో జీవితాలు బుగ్గిపాలయ్యాయి. సామాన్యుల అవసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలకు అప్పులిచ్చి వారి రక్తాన్ని పీల్చేస్తారు. కాల్ మనీ రాక్షసుల ఆగడాలకు ఎంతోమంది జీవితాలు బలయ్యాయి. కొన్నిరోజుల క్రితం వినాయకపురం గ్రామానికి చెందిన మక్కెళ్ల నాగరాజు (30) నిండు ప్రాణం తీసుకున్న ఘటన మనం చూసాం. *ముఖ్యంగా చిరు వ్యాపారులే టార్గెట్* :

తాజాగా ఓ ఘటనతో కాల్ మనీ మాఫియా చీకటి కోణాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ ఫైనాన్స్ వ్యాపారులకు చిరు వ్యాపారాలే టార్గెట్ మార్కెట్లలో పూలు, పండ్లు, కూరగాయలు లేదా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునేవారికి రోజు ఉదయం డబ్బు ఇస్తారు సాయంత్రం వడ్డీ కలిపి ఇచ్చేయాలి. ఆ రోజు వ్యాపారం సరిగ్గా జరగక డబ్బు చెల్లించని పక్షంలో వడ్డీకి వడ్డీ లెక్కగట్టి వసూలు చేస్తారు. ఒక పండ్ల బండి చిరు వ్యాపారిని ఆరా తీయగా వారి వద్ద అప్పు చేస్తే జీవితాంతం సంపాదించి కట్టినా వాళ్ళ అప్పులు తీర్చలేమని వాపోతున్నారు. అంతేకాదు వారి అన్యాయాలు, అక్రమాలకు అంతు ఉండదని తెలిపాడు. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు భారీగా సంపాదిస్తున్నారని.., వారి ఆగడాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికార పార్టీ పెద్దమనుషులకు లంచాలిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

*ఒక ఆటో యజమాని,ఒక జామాయిల్ వ్యాపారి లీలలు* :

వినాయకపురం గ్రామంలో ఆటో తోలుకునే వ్యక్తి, ఆయనతో పాటు వున్న జమాయిలు వ్యాపారం చేసే ఒక వ్యక్తి ఇద్దరి వాటాలతో చిరు వ్యాపారులు, అమాయక ప్రజల్నే వారు టార్గెట్ చేస్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా పనులు చేసే తోటి వాళ్ళకే వడ్డీకి డబ్బు ఇస్తుంటారాని, వీళ్ల దగ్గర అప్పు తీసుకుంటే వెంకన్న స్వామి కుబేరుడికి అప్పున్నట్లు, ఎంత జమవేసినా అతని అప్పు తీరదంటూ వాపోతున్నారు. ఇలా వీళ్ల  వద్ద తీసుకున్న అప్పు తిరిగి కట్టలేక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఊరు వదిలి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

 *10రూ.నుంచి15రూ.ల వరకు బారు వడ్డీ,చక్ర వడ్డీ*: 

వినాయకపురం కాల్ మనీ మాఫియా ఇచ్చే అప్పులకు 10 నుంచి 15శాతం వడ్డీ వసూలు చేస్తారని.. సకాలంలో అసల, వడ్డీ కట్టకపోతే వడ్డీకి చక్రవడ్డీ, బారువడ్డీతో పాటు ఆలస్యంగా ఇచ్చావంటూ జరిమానాలు కూడా వసూలు చేస్తారు. ఆన్ లైన్ లోన్ యాప్స్ ఫోన్లలో వేధిస్తే.. వీరు నేరుగా ఇళ్లకు, మార్కెట్లకు వెళ్లి అందరిముందు నిలదీసి పరువు తీస్తారనే ఆరోపణలు వెదజల్లుతున్నాయి. వీరి వేధింపులకు చిరువ్యాపారులు, చిన్నచిన్న పనులు చేసుకునేవారు బలైపోతున్నట్లు సమాచారం.

వినాయకపురంలో కాల్ మనీ వ్యాపారులు పూర్తి అర్థం మార్చేశారు. అవసరం ఉందంటే చాలు అరగంటలో అప్పు ఇస్తారు. ఆపదలో ఆదుకున్నారు కదా. వారు మహానుభావులు అనుకుంటాం. కానీ ఆతర్వాతే కాల్ మనీ వ్యాపారుల అసలు స్వరూపం బయటకొస్తుంది. వడ్డీని, రుణాన్ని ఎప్పుడైనా వసూలు చేసుకోవచ్చన్న నిబంధనలను సాకుగా చూపి బాధితులు తీసుకున్న రుణాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. రుణం తీసుకున్న వ్యక్తి అసలు చెల్లించినా వడ్డీ కట్టాలంటూ వేధిస్తున్నారు. ఎంతలా అంటే 30వేలు రుణం తీసుకుంటే 3లక్షలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికయినా సంబందించిన అధికారులు చర్యలు తీసుకోవాలి అని ప్రజలు వేడుకుంటున్నారు.

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: