CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా,ఉద్యమించాలి : విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి రమేష్.

Share it:


 మన్యం మనుగడ , ఏటూరునాగారం :  ఏటూరునాగారం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి మొదటి రోజు క్లాస్ మతం-మతోన్మాదం  బోధించిన విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.దేశంలో మతోన్మాదము పెరిగి పోయిందని ప్రజలు ఏం తినాలో ఏం మాట్లాడు కోవాలో ఎలాంటి దుస్తులు వేసుకోవలో కేంద్రంలో పాలిస్తున్న బిజెపి పార్టీ ప్రజల్ని శాసిస్తుందని భారత దేశ రాజ్యాంగంలో భిన్నత్వంలో ఏకత్వం సెక్యులరిజం రాసుకున్నామని 75 ఏళ్ల తర్వాత దేశంలో దళితుల మీద దాడులు,గోమాంసం తిన్నారని ముస్లింల మీద దాడులు చేస్తూ భయానిక వాతావరణం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.ఈరోజు ఏ మతంతో  సంబంధంలేని ఆదివాసీల కు దళితులకు పండగల పేరుతో హిందూ భావజాలాన్ని,చూప్పిస్తున్నారనిదేశ ప్రజల్ని మతాల పేరుతో విభజించి కులాల పేరుతో విభజించి దోపిడీ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.దేశంలో ప్రశ్నించే గొంతులను హేతువాదలను ఉపా చట్టం పేరుతో తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే గొంతులను కర్ణాటకలో గౌరీ లంకేష్,కల్బుర్గి,దబోల్కర్ వంటి మేధావులను హతమారుస్తున్నారని ఇవన్నీ మతోన్మాద ఫాసిస్టు చర్యలని వీటికి వ్యతిరేకంగా ప్రజలు సమీకరించి వర్గ సమస్యల మీద ప్రజా ఉద్యమాలు నిర్మించాలని హిందుత్వ మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో తుమ్మల వెంకటరెడ్డి,సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి దావూద్  సాంబశివ,దబ్బగట్ట లక్ష్మయ్య, రత్నం రాజేందర్,జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల రఘుపతి,వంక రాములు, ఎండి గఫూర్ పాషా,కావిరి సుధాకర్,జాగటి చిన్న,దుగ్గి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: