CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలవరం ఎత్తును తగ్గించుకుంటే ఉద్యమాలను ఉదృతం చేస్తాం

Share it:

 


*పోలవరం ఎత్తును తగ్గించుకుంటే ఉద్యమాలను ఉదృతం చేస్తాం

*తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్,ప్రచార కార్యదర్శి ఆలేం కోటి.

మన్యం మనుగడ, ఏటూరు నాగారం:

తాడ్వాయి మండలం రంగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఈనెల 30 న భద్రాచలం లో తలపెట్టిన తుడుందెబ్బ సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే పోలవరం ప్రాజెక్ట్ వలన లక్షల మంది ఆదివాసీలు జలసమాధి అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ప్రాజెక్ట్ పూర్తి కాక ముందే ఈ సంవత్సరం వచ్చిన వరదల్లో ఆదివాసీలు జల విద్వంసంని చూడాల్సి వచ్చిందని అన్నారు.నాటి తెలంగాణ పోరాటం లో పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్ర కి బలిచ్చిన తెలంగాణ ఉద్యమం,నేటి తెలంగాణ ప్రభుత్వ పెద్దలు,కనీసం తెలంగాణ లోని బ్యాక్ వాటర్ ముంపు నీ కూడా కచ్చితంగా అంచనా వేసే పరిస్థితి లేదని అన్నారు.భవిష్యత్ లో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే భద్రాచలం పూర్తిగా నీటిలో నే ఉండాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.భద్రాచలం రాముడు నీటిలో మునిగిన హిందుత్వం గురించి గొప్పలు చెప్పే బీజేపీ కేంద్రం లో ఉన్న కూడా పట్టింపు లేదని అంటే ఆదివాసీలను జలసమాధి చేయటానికి రాజకీయ పార్టీ ల కుట్రలు అని అర్థం చేసుకోవాలని అన్నారు.

కాపర్ డ్యాం బ్యాక్ వాటర్ తో శబరి నది బ్రిడ్జి పై 25 అడుగుల నీటి మట్టం నిలువ ఉంది అంటే ఎంత ప్రమాదం భవిష్యత్ లో పొంచి ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. 2013 పునర్ నివాస చట్టం పూర్తిగా విఫలం అయిందిని ఈ ఏడాది వరదల్లో మునిగిన గుడేలకు దిక్కే లేకుండా  పోయిందని అన్నారు. పోలవరం ముంపులో 5 వ షెడ్యుల్ లో 6 వేల చదరపు కిలోమీటర్ల షెడ్యుల్ భూభాగం, 200 పైచిలుకు షెడ్యుల్ గ్రామాలు,2 లక్షల జనాభా నిర్వాసితులు అవుతున్న ఈ దేశానికి ఆదివాసి రాష్ట్ర పతి ఉన్న,పోలవరం ముంపు ప్రాంతాలను రాష్ట్ర గవర్నర్ సందరిసంచి పోయిన పలితం లేదని అన్నారు.అమాయక ఆదివాసీలను ముంచటానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఏకం అయి జలసమాధి చేస్తున్నాయని అన్నారు.రాష్ట్ర వ్యాప్త ప్రతినిధులు ఈ సభలో హాజరు అవుతారు అని తెలిపారు.

నిర్వాసితుల గోడు వర్ణతితం అని భవిష్యత్తులో పోలవరం నిర్వాసిత ఉద్యమం ని తుడుందెబ్బ ఆదివాసి సంఘాలను బుద్ధి జీవులను మేధావులను కలుపుకొని ఉవ్వెత్తున లేపుతుంది అని, నిర్వాసితుల పక్షాన పోరాటాలు కొనసాగుతాయి అని తెలిపారు.ఈనెల 30 న జరిగే సదస్సులో పోలవరం ఉద్యమం భవిషత్ కార్యాచరణ కూడా రాష్ట్ర కమిటీ తీసుకుంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రంగాపురం సర్పంచ్ ఇర్ప సూర్యనారా యణ,తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు యెట్టి ప్రకాష్, కార్యదర్శి జవ్వాజి,మోహన్ రావు,ఇర్ప ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

AP

TELANGANA

Post A Comment: