CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు

Share it:

మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని వంద పడకల ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, శనివారం సందర్శించారు. ఆసుపత్రిలో వైద్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో పలు రకాల సమస్యలతో చికిత్స పొందుతున్న రోగులకు అందిస్తున్న వైద్య సేవలు గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.చికిత్స పొందుతున్న పేషంట్ లను వారు పరామర్శించారు. అనంతరం ఆస్పత్రిలో డెలివరీ అయిన మహిళకు కెసిఆర్ కిట్టును అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ,సీఎం కేసీఆర్ హయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక రకాలుగా మెరుగుపడుతున్నాయని,ప్రజలకు ప్రభుత్వం,వైద్యంపై భరోసా కల్పించడంతో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి అని తెలిపారు.ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా మహిళలు పిల్లలు ఆరోగ్య సంరక్షణకు,రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ పథకం అద్భుత ఫలితాలను ఇస్తుందని అన్నారు.భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతులుగా ఎదిగేందుకు ఆటంకంగా ఉన్న పోషిక ఆహార ఇన్స్పెక్షన్ లోపాలను,ధిగమించేందుకు కెసిఆర్ కిట్టు పథకం ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తున్న కేసీఆర్ కీట్ పథకంతో ఆరోగ్య సుచికలలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది అని తెలిపారు.ప్రభుత్వ,ఆసుపత్రులలో పుట్టిన మగ శిశువుకు రూ.12,000 రూపాయలు,ఆడ శిశువు పుడితే రూ.13,000 రూపాయలు నగదును ఆర్థిక సహాయం గా ప్రభుత్వ ఆనందిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యకర సమాజాన్ని తీర్చిదిద్దేతందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. నిరుపేదల కుటుంబాలకు చెందిన గర్భిణీలు నెలలు నిండాక పనులు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు.సర్కార్ ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకునే వారికి కేసీఆర్ కిట్టు పథకం ద్వారా 16 రకాల వస్తువులతో కూడిన బ్యాగును ఇవ్వడంతో పాటుగా, ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాం అని తెలియజేశారు.ఈ పథకం ద్వారా సమర్థవంతంగా నిర్వహిస్తున్న కారణంగా రాష్ట్రంలోని సర్కార్ ఆసుపత్రు లలో ప్రసవాలను సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు ఎంపీపీ కారం విజయ కుమారి, హాస్పిటల్ సూపర్నెంట్ గిరిప్రసాద్,స్ధానిక ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: