CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమాచార హక్కు చట్టం పై ప్రజలకు అవగాహన పెంచాలి : రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా.గుగులోత్ శంకర్ నాయక్.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

సమాచార హక్కు చట్టం పట్ల సామాన్య ప్రజలకు అవగాహన పెంచాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. గుగులోత్  శంకర్ నాయక్ అన్నారు.శుక్రవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన అప్పీల్ హియరింగ్ లో  సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగిన దరఖాస్తుదారులు,పౌర సమాచార అధికారులతో 30 కేసులకు సంబంధించి విచారణను కమీషనర్ నిర్వహించారు. 

సమాచార హక్కు చట్టం సెక్షన్ 5 (1) 5 (2) ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ 4 (1) బి సమాచారాన్ని తప్పనిసరిగా  పొందుపరచాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా.గుగులోత్  శంకర్ నాయక్ అన్నారు.

సమాచార హక్కుచట్టం సెక్షన్ 6(1) ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని, సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజులలో అందించాల్సిన బాధ్యత ఆయా శాఖల ప్రజా సమాచార అధికారులపై ఉందని ఆయన అన్నారు.అనంతరం పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర సమాచార కమిషనర్ డా. గుగులోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం విధులు,పరిధి, రాష్ట్ర సమాచార కమిషన్ ద్వారా ఇప్పటి వరకు పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను వెల్లడించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత అధికార యంత్రాంగంలో జవాబుదారితనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజుల కాలంలో ఇవ్వాలని, అలా సకాలంలో సమాచారం ఇవ్వని కారణంగా కమిషన్ నేరుగా ప్రజలు,ఆయా శాఖల పౌర సమాచార అధికారులతో  జిల్లా  కేంద్రంగా కమిషన్ కోర్టును ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ములుగు జిల్లాకు సంబంధించి న కేసుల విచారణ  ప్రక్రియ నిర్వహించి దరఖాసుదారులు కోరిన సమాచారాన్ని అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 

సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇవ్వని యెడల,మొదటి అప్పీల్ చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని అన్నారు. 30 రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వని క్రమంలో సెక్షన్ 19 (1) ప్రకారం మొదటి అప్పీల్ చేసుకుంటే మొదటి అప్పిలేట్ అధికారి సమాచారం విచారణ చేపట్టి ఇప్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మొదటి అప్పిలేట్ అథారిటి ఉండి, పరిష్కారం చేయని యెడల సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషనర్ కి దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు.ఈ జాప్యాన్ని తొలగించి, ప్రజల్లో చైతన్యం నింపేందుకు, 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం అందించే విధంగా కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.జిల్లాకు సంబంధించిన 30 కేసుల విచారణ నిర్వహించి దరఖాస్తు దారులకు కోరిన సమాచారం సత్వరమే అందించే పరిష్కార చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ప్రజా ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం కోరిన సమాచారాన్ని దరఖాస్తు దారులకు సకాలంలో అందించాలని పౌర సమాచార అధికారులను ఆదేశించినట్లు కమీషనర్  తెలిపారు.పౌర సమాచార అధికారులు సెక్షన్ 4(1) బి ప్రకారం 17 అంశాలతో కూడిన సమాచారం కార్యాలయంలో ప్రదర్శించాల న్నారు. సెక్షన్ 4(1) బి నిర్వహణ వల్ల కార్యాలయ విధులు  నిర్వహణ,

కార్యాలయ సమగ్ర సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు.సెక్షన్ 5 (1), 5 (2) ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005 లో పౌర సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అథారిటీల పేర్లు, హోదా, ఫోన్ నెంబర్ల వివరాలతో  అమలు బోర్డులు ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు.ప్రతి పౌర సమాచార అధికారి సమాచార హక్కు చట్టం - 2005 సమాచార రిజిస్టర్ 16 కాలమ్ లతో కూడినది, మొదటి అప్పిలేట్ అథారిటీ 8 కాలమ్ లతో కూడిన రిజిస్టర్ లను నిర్వహించాలన్నారు. పౌరులకు సమాచారం అందచేయడం,సత్వర పరిష్కారానికి రాష్ట్ర కమీషన్ చర్యలు చేపడుతూ,ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.  దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర కమిషన్ సెకండ్ అప్పిలేట్ ఆధారిటికి దరఖాస్తు చేస్తే, రాష్ట్ర కమీషన్ మూడు నుంచి ఆరు నెలల లోపే కేసు విచారణ చేపట్టి సమాచారం అందిస్తూ, విజయవంతంగా ముందుకు వెళ్తుందని అన్నారు. కరోనా ఉధృతి లాంటి విపత్కర పరిస్థితుల్లో టెలిఫోనిక్ హియరింగ్ చేపట్టి అనేకమంది దరఖాస్తుదారులకు సమాచారం ఇప్పించడంలో తెలంగాణ కమిషన్ సేవలు అందించిందన్నారు.  రాష్ట్ర స్థాయిలో 38 వేల కేసుల్లో 30 వేల పైచిలుకు కేసులను, ములుగు  జిల్లాలో 140 అప్పిళ్లకు గాను 90 అప్పిళ్లను  పరిష్కరించామన్నారు. మిగిలినవి త్వరలో పరిష్కారం చేస్తామని అన్నారు.సమాచార హక్కు చట్టాలపై ప్రజలను చైతన్యపరుచుటలో మీడియా సహకారం అందించాలని ఆయన కోరారు.సమాచార హక్కుచట్టంపై ప్రజలకు చైతన్య సదస్సులు నిర్వహిస్తామని అన్నారు.ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు ఎలా ఉపయోగిం చుకుంటున్నమో,సమాచార హక్కు చట్టాన్ని కూడా అదే తరహాలో సద్వినియోగ పరుచుకోవాలన్నారు.

అంతకుముందు అదనపు కలెక్టర్ రెవిన్యు వై వి గణేష్,డి ఆర్ ఓ రమాదేవి, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ భాస్కర్, సమాచార హక్కు చట్టం కమిషనర్ కు స్వాగతం పలికారు.

Share it:

TELANGANA

Post A Comment: