CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకున్న ఎంపీపీ జల్లిపల్లి

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో దేవివరాత్రుల మహోత్సవంలో భాగంగా సోమవారం అశ్వారావుపేట గ్రామంలోని గాంధీ బొమ్మ సెంటర్ నందు గల శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం మరియు నారంవారీ గూడెం గ్రామంలో ఉన్న దేవస్థానం  నందు శ్రీ కాశీ అన్నపూర్ణాదేవినీ దర్శించుకొని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ అశ్వారావుపేట గ్రామంలో వెంచేసి ఉన్నా ఈ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు ప్రతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని, దానిలో భాగంగానే ఈ దసరా నవరాత్రులను, అంగరంగ వైభవంగా ఏర్పాట్లను చేశారని, దానిలో భాగంగానే ప్రతి రోజూ ఒక అవతారంలో అమ్మవారిని అలంకరణ చేస్తారని ఆలయ కమిటి ఛైర్మన్ ముత్తా సుమాకర్ అధ్యక్షతన, నారంవారిగుడెం గ్రామంలో బండి పుల్లారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి తెలిపారు. వాటిలో భాగంగా ప్రతి రోజూ అమ్మవారి అలంకరణ వివరములు: 26-09-2022- సోమవారం శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి అవతారం. 27-09-2022- మంగళవారం శ్రీ మాంగళ్యాగౌరి దేవి అవతారం. 28-09-2022- బుధవారం శ్రీలలితా దేవి అవతారం. 29-09-2022- గురువారం శ్రీ సంతానాలక్ష్మి దేవీ అవతారం. 30-09-2022- శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి అవతారం. 01-10-2022- శనివారం శ్రీ ధనలక్ష్మీ దేవీ అవతారం. 02-10-2022- ఆదివారం శ్రీ సరస్వతీ దేవి అవతారం. 03-10-2022- సోమవారం శ్రీ దుర్గాదేవి అవతారం. 04-10-2022- మంగళవారం శ్రీ కాళికా దేవి అవతారం. 05-10-2022- బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరిదేవి, భ్రమరాంబికాదేవి అవతారం. అలాగే 07-10-2022 శుక్రవారం నాడు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున ఎవన్మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించ గలరని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు తెరాస పార్టి మండల అధ్యక్షులు బండి పుల్లారావు, మండల నాయకులు తాడేపల్లి రవి, శెట్టిపల్లి రఘురామ్, ఆలయ అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: