CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దయచేసి నన్ను నా బిడ్డని బ్రతికించండి -చికిల్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితురాలు

Share it:

మన్యం మనుగడ, అశ్వారావుపేట: రోజుల గడుస్తున్నా కొద్దీ బతుకుతానో, లేదో తెలియదు గాని కడుపులో ఉన్న ప్రాణాన్ని అయినా బతికించండి అంటూ దాతల కోసం ఎదురుచూస్తున్న ఓ నిరుపేద కుటుంబానికి  చెందిన మాలోత్ రమాదేవి ఆరోగ్య  పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. అందరిలాగే తనవారి కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలన్న ఆశతో భయంకరమైన వ్యాధిని సైతం లెక్కచేయకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమే జీవన పోరాటం చేస్తున్న ఓ నిరుపేద బాధితురాలు. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, గాండ్ల గూడెం గ్రామానికి చెందిన మాలోత్ రమాదేవి వయస్సు 19 సంవత్సరాలు చిన్ననాటి నుండి చికెన్ తల సేమియా వ్యాధితో బాధపడుతూ కుటుంబ సభ్యులకు భారమైనప్పటికీ, బతకాలన్న ఆశతో అందరి ఆడపిల్లల వలె తాను వివాహం జరిపించుకున్నానని, ఇప్పుడు ఐదో నెల కావస్తుందని ,కడుపులో పెరుగుతున్న బాబు కోసం డాక్టర్ల సలహాల మేరకు రోజువారి ఐరన్ ఇంజక్షన్ వంటి డ్రగ్స్ తీసుకుంటున్నానని,  గర్భంలో శిశువు ఆరోగ్యంగా ఉండడానికి ఐరన్ పంపు వంటి పరికరాలను అమర్చి వైద్యం జరిపిస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటుందని, దానికి గాను సుమారు పది లక్షల రూపాయల మేరకు వైద్య ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో, చిన్ననాటి నుండి నేటి వరకు ఈ వ్యాధి వల్ల కుటుంబ సభ్యులు ఆమె కోసం అనేక సమస్యలను ఎదుర్కొన్నారని అన్ని వదులుకొని రోడ్డునపడ్డారని, ఏం చేయాలో తెలియక సహాయం కోసం ఎదురు చూస్తున్నానని దయచేసి నన్ను, నా కడుపులో పెరుగుతున్న బిడ్డను దాతలు ఆదుకొని బతికిస్తారని ఆశతో మీడియా ముందుకు రావడం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం తల సేమియా వ్యాధిగ్రస్తులకు పెన్షన్స్ సౌకర్యాలు కల్పిస్తానని చెప్పినా నేటికీ అవి అమలు కాకపోవటం మరింత పెనుభారంగా మారిందని, దాతలు సహాయం చేసి నన్ను నా బిడ్డను బతికిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. దాతలు ఎవరన్నా ఈ సెల్ నెంబర్ 9014987503,  8919171588, 9381308715 గూగుల్ పే ఫోన్ పే ద్వారా సహాయం చెయ్యాలని కోరుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: