CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వం గుర్తించి సత్కరించాలి

Share it:


మన్యం టివి,మణుగూరు: సెప్టెంబర్ 5, న ప్రభుత్వం ప్రభుత్వ అంగ రంగ వైభవంగా పండుగలాంటి వాతావరణం లో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సన్మానం చేస్తుంది. ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వ,ప్రైవేట్ అనే ఉపాధ్యాయులు అని విడదీసి చూడటం తప్పు అని,ప్రతి ఒక్క ఉపాద్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులే ఇందులో ఉత్తమ ఉపాధ్యాయులు అంటూ కొందరికి సన్మానం చేయడం తప్పు అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే.తల్లి ఏ విధంగా అయితే తన పిల్లల భవిష్యత్ కోసం తపన పడుతుందో,అదే విధంగా ఉపాధ్యాయులు తన విద్యార్థుల భవిష్యత్ కోసం తపన పడతారు అని,వారి కోసం అహర్నిశలు శ్రమించి వారికి విద్యా బుద్ధులు నేర్పించి సమాజం లో ప్రయోజకులు గా తీర్చి దిద్ది దేశ అభివృద్ధికి పాటు పాటుపడతారు అని ప్రైవేటు ఉపాధ్యాయులు మైపా శంకర్ అన్నారు. అటువంటి ఉపాధ్యాయుల లో ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయులనే సన్మానించడం భావ్యం కాదు అని,ప్రైవేట్ ఉపాధ్యాయులు  సన్మానానికి అర్హులు కారా అని ప్రశ్నించారు. అటువంటప్పుడు ప్రైవేట్ రంగాన్ని ఎందుకు ప్రోత్సాహస్తున్నారు అన్నారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల పాఠశాలల్లో ఉన్న 30 లక్షల విద్యార్థులకు చదువు చెప్పి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అరకొర జీతాలతో రోజుకు 8 నుండి 12 గంటలు శ్రమిస్తున్న 4 లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉన్నారు వీరందరు ఉత్తమ ఉపాధ్యాయులు కారా,వీరు సన్మానానికి అనర్హులా,అయితే ప్రైవేట్ విద్యా రంగంలో వస్తున్న ఇన్ని ర్యాంకులు ఎక్కడ నుండి వస్తున్నవి అటువంటి ప్రతిభను నూరిపోసిన ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా ముమ్మాటికీ అర్హులే అటువంటి గురువులను గురు పూజోత్సవం నాడు ప్రభుత్వం గుర్తించి సన్మానం చేయాలి. అసలు ఉపాధ్యాయ అనే పదమే చాలా గొప్పది గురు బ్రహ్మ గురు విష్ణు,గురు దేవో భవ,గురు సాక్షత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నప్పుడు ప్రతి గురువు సన్మానానికి అర్హుడే,అటువంటి గురువులను ప్రభుత్వం ప్రైవేట్,ప్రభుత్వం,అనే తారా తమ్యం లేకుండా ఉపాధ్యాయులందరిని గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: