CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వరదలకు కొట్టుకుపోయిన రోడ్ల కు తక్షణమే మరమ్మతులు నిర్వహించాలి

Share it:

 


◆ వరదలకు కొట్టుకుపోయిన  రోడ్ల కు తక్షణమే మరమ్మతులు నిర్వహించాలి

◆ ప్రజలతో దురుషుగా వ్యవహరిస్తున్న కొయ్యురు పంచాయతీ కార్యదర్శి వైఖరి మార్చుకోవాలి..

◆ కొయ్యురు పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి...

◆ సిపిఐ(ఎం.ఎల్ )ప్రజాపంధా చర్ల మండల నాయకులు కొండా చరణ్..

 మన్యం టీవీ చర్ల : 

చర్ల మండలం కొయ్యురు పంచాయతీలోని గ్రామాలలో నెలకొన్న సమస్యలపై  సిపిఐ ఎంఎల్  ప్రజాపంధా పార్టీ  క్షేత్ర స్థాయి సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రజాపంధా మండల నాయకులు కొండా.చరణ్ మాట్లాడుతూ కొయ్యురు పంచాయతిలో అనేకసమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో , కొయ్యురు పంచాయతీ అధికారి విఫలమవుతున్నారని అన్నారు. ఇందుకు కారణం  పనిపై ప్రజలపై కార్యదర్శి కి ఉన్న నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. 

కొయ్యురు నుండి సుందరయ్య కాలనీ రామాంజనాపురం గ్రామాలకు వెళ్లే తారు రోడ్డు ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు వరదలకు మొత్తం కొట్టుకుపోయింది. దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రాత్రి పూట అవసరాల రీత్యా వాహనదారులు, రైతులు  ప్రయాణించే క్రమమంలో ఈ గోతుల్లో పడుతున్నారు. ఆసుపత్రి పాలు అవుతున్నారు. ఈ రోడ్డు కొట్టుకపోయి ఇన్ని రోజులవుతున్నా ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నా అధికారికి మాత్రం చీమకుట్టినటయినా లేదు, ఇప్పటివరకు పిడికెడు మట్టిని కూడా ఈ గుంతల్లో పోయించలేదు. తక్షణమే నిర్లక్ష్యం వీడి  ఈ రోడ్డుకి మరమ్మత్తులు చెయ్యాలలని డిమాండ్ చేశారు. కలుషిత నీటిని త్రాగుతునందున, దోమల  కాటు కారణంగా  గ్రామాల్లో ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. ప్రజల ఆరోగ్యాలపై శ్రద్ధ ,శానిటైజ్ సక్రమంగా జరగని కారణంగానే ఇలా జరుగుతుందని అన్నారు. మీషన్ భగీరథ సమస్య తనకు చెప్పొద్దని కార్యదర్శి అనడం భాద్యత రాహిత్యమని మండిపడ్డారు. పంచాయతీ ట్రాక్టర్ ని ఎవరు పడితే వారు నడుపుతున్నారని, కొంతమంది వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటున్నారని ఇది సరైనది కాదని అన్నారు. పరిస్కారం అడిగిన ప్రజలపట్ల దురుసుగా మాట్లాడటం మానుకోవాలని అన్నారు. కొయ్యురు పంచాయతీ ప్రజలు కార్యదర్శి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. సర్వేలో వచ్చిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెలుతామని అన్నారు.  తక్షణమే కార్యదర్శి తన స్థాయిలో పరిష్కరమయ్యే ఈ సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ప్రజలను సమీకరించి  మండలం నుండి జిల్ల అధికారుల సమక్షంలో పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో  ప్రజాపంధా పార్టీ మండల నాయకులు పాలెం చుక్కన్న, రవి, వీనమ్మ, భద్రయ్య, కృష్ణ వెని, నుపయ్య, జోగారావు రమేష్, పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: