CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేద ప్రజల సంక్షేమమే టీఆరెఎస్ ప్రభుత్వ లక్ష్యం

Share it:

 


  • పేద ప్రజల సంక్షేమమే టీఆరెఎస్ ప్రభుత్వ లక్ష్యం
  • రూ.74,08,584 విలువ గల కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావు

మన్యం టివి, మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని పద్మశాలి భవన్ నందు శుక్రవారం నాడు తహశీల్దార్ నాగరాజు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్య్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావు పాల్గోన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 74 మందికి లబ్ధిదారుల కు మంజూరైన రూ.74,08,584  రూపాయల కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,చెక్కులను,బతుకమ్మ చీరలను మహిళలకు ప్రభుత్వ విప్,రేగా కాంతారావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా విప్ రేగా కాంతరావు మాట్లడుతూ, పేదింటి ఆడపడుచులకు, కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్, ఒక వరం అన్నారు.అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని,సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ,రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.2014 కు ముందు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే పేదవారు అప్పు చేసి పెళ్లి చేసేవారని అని,టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్, ఆడబిడ్డలకు మేనమామ గా రూ.1,00,116 రూపాయలను ఆడబిడ్డలకు ప్రభుత్వం కానుకగా చెక్కుల రూపంలో నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు.దివ్యాంగులకు నెలకు రూ.3016,వితంతువులు, వృద్దులకు ఇతర కేటగిరీల వారికి రూ.2016 చొప్పున అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దళిత బంధు పథకం ద్వారా దళితులకు చేయూతనిస్తూ, వారిని అన్ని రంగాలలో ఎదిగేలా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.దళిత బంధు పథకం దళితులను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడంతోపాటు,ఐక్యతకు నిదర్శనం గా మారిందని ఆయన పేర్కొన్నారు.ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి పండుగలకు కానుకలు ఇస్తూ, గౌరవిస్తున్నారని కొనియాడారు. మహిళల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుంది అన్నారు.మన సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే నేతన్నల కుటుంబాలకు రెట్టింపు ఆదాయాన్ని అందిస్తూ,అండగా నిలుస్తున్నారని అన్నారు.రూ.339 కోట్లతో,కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. కావాలనే విపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని, ప్రజలు గమనించాలని కోరారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నారో, తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంపై ఇక్కడి పరిపాలనపై మాట్లాడే నైతిక హక్కు ఇతర పార్టీలకు లేవని హెచ్చరించారు. కేంద్రం రాష్ట్రానికి సహకరించకపోగా దేశ సంపదను ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతుందని అన్నారు. దేశం లో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఏకైక ప్రభుత్వం టీఆరెఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు,జెడ్పీటీసీ పొశం.నర్సింహారావు,తహశీల్దార్ నాగరాజు,స్ధానిక ఎంపీటీసీ రమ్య,ఎంపీటీసీ లు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, సర్పంచ్ బచ్చల.భారతి, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఏనిక ప్రసాద్,సర్పుంచ్ లు,ఉప సర్పంచ్ లు,టీఆరెఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, కార్యదర్శులు,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: