CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాఠశాల కాదనుకుంటే పొరపాటే..?? ఏళ్లు గడుస్తున్న పూర్తికాని సుజ్ఞానపురం ప్రాథమిక పాఠశాల.. నేల మీద కూర్చొని విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు..

Share it:



మన్యం టివీ, దుమ్ముగూడెం::

మండల పరిధిలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన సుజ్ఞానపురం గ్రామంలో ఉన్నటువంటి మండల ప్రాథమిక పాఠశాల కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నేల మీద కూర్చొని చదువుకుంటున్న వైనం సుమారు 30 మంది విద్యార్థులు ఉంటున్న ఈ పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు లేవని కొందరు విద్యార్థులు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తో గూడెం పాఠశాలకు ఈ ఊరు నుండి ఐదుగురు పిల్లలు వెళ్తున్నారంటే ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎటు పూర్తవకుండా అసంపూర్తిగా ఉన్నటువంటి పాఠశాల బిల్డింగ్ చూస్తేనే అర్థమవుతుంది ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని కనీసం ఫ్లోరింగ్ వరకు అయిన చేపిస్తే పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుందని పిల్లల తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఇక్కడ పరిస్థితిని ఉపాధ్యాయుడు లక్ష్మణ్ అడగగా తను ఈనెల 6 తేదీన కొత్తగా వచ్చానని స్థానిక సర్పంచ్ ఇక్కడ పరిస్థితి తెలియజేశానని పిల్లలకి ఇసుకలో కూర్చొని చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని తను తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్య వివరణ అడగ్గా గతంలో 5  లక్షల నిధులు వెనక్కి వెళ్లిపోయాయని, దీన్ని పై అధికారులకు దృష్టికి తీసుకెళ్ళమని ఎంపీడీవో వారు జెడ్పీ నిధులను నుండి 5 లక్షలు మంజూరు చేస్తామన్నారని కానీ ఇంతవరకు కార్యరూపం కాలేదని తెలిపారు. ప్రారంభించిన కాంట్రాక్టర్ చేతులెత్తేసారని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్య కొరకు ఎన్నో సౌకర్యాలు అందిస్తున్న గత 5 సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ భవనాన్ని ఎవరు పట్టించుకోకపోవడం విడ్డూరమే మరి. ఇప్పటికైనా అధికారులు గుర్తించి భవనాన్ని పునర్నిర్మాణం చేయాలని గ్రామస్తులు పిల్లల తల్లిదండ్రులు వేడుకున్నారు

Share it:

TELANGANA

Post A Comment: