CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈ నెల 16 వ తేదిన 15 వేల మందితో నిర్వహించే భారీ ర్యాలీలో భాగస్వామ్యం కండీ -ఎమ్మెల్యే మెచ్చా

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినంగా, మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం 17 సెప్టెంబర్, 2022 నాటికి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్నదని, ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటిస్తూ మూడు రోజులపాటు 16, 17, 18 సెప్టెంబర్, 2022 రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించరని దానిలో భాగంగానే అశ్వారావుపేట నియోజక వర్గంలో జరగాల్సిన కార్యక్రమాలను తెలియజేస్తున్నట్లు ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వర రావు అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను ఈ విధంగా సెప్టెంబర్ 16వ తేదీన  అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో  విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టి అభిమానులతో భారీ ర్యాలీలు నిర్వహించాలని అట్టి ర్యాలీ కి నియోజక వర్గంలోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు అధికారుల, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనలని అలాగే ప్రతి మండలం నుండి వేలాది మంది హాజరు అవ్వాలని అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు తెలిపారు. అలాగే అశ్వారావుపేట రింగ్ రోడ్డు నుండీ జాతీయ జెండాలతో  ప్రారంభమైన ర్యాలీ ముగిసిన అనంతరం ప్రతి ఒక్కరికి బోజనాలు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. నియోజక వర్గ అధికారులూ అందరూ సమన్వయంతో కలసి ఈ కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పార్కింగ్ కి స్థలాలను, అలాగే భోజనాలు  చేసే దగ్గరా కావలసిన ఆన్ని రకాలా ఏర్పాట్లు చేసి తెలంగాణ రాష్ట్రం లోనే అశ్వారావుపేట నియోజక వర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు తేవాలని, అధికారులను, ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు ఆదేశించారు. సెప్టెంబర్ 17వ తేదీన అన్ని పంచాయతీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతి మండలం నుంచి గిరిజన ప్రజాప్రతినిధులు గిరిజన ఉద్యోగులందరూ కూడా హైదరాబాదులో జరిగే బంజారా భవన్ ఆదివాసి గిరిజన భవన్ ప్రారంభోత్సవానికికి లక్షలాదిమందిగా తరలి వెళ్లాలని దానికి తగిన ఏర్పాట్లు అధికారులు ఏర్పాటు చేస్తారని తెలియజేశారు. సెప్టెంబర్ 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయాలి. కవులు కళాకారులను గుర్తించి సత్కరించాలి. ఘనంగా 'తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ' స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: