మన్యం టీవీ చర్ల :
ఈరోజు చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(KGBV) లో వైద్య శిబిరం నిర్వహించడంజరిగింది.
వైద్య శిబిరం నందు 40 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా ఐదుగురు జ్వర పీడితులు గా గుర్తించడం జరిగింది. మిగతా వారికి సాధారణ జలుబుకు దగ్గుకు చిరు వ్యాధులకు చికిత్స చేయడం జరిగినది.
తర్వాత ఆ విద్యాలయంలో చదివే పిల్లలందరినీ సమూహ పరిచి ఈ క్రింది విషయాల గురించి తెలియజేయడం అవగాహన పంచడం జరిగింది.
తరుణ వ్యాధులు ఎలా వస్తాయి వాటిని వాటి లక్షణాలు ఏంటి ,చిహ్నలు ఏంటి, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఏంటి, నివారణ మార్గాలు, చికిత్స విధానం గురించి తెలియజేయడం జరిగింది.
మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.
కౌమారదశ లో బాలికల లో జరిగే శారీరక మార్పులు, మానసిక సంఘర్షణల ఎదుర్కొనడం, పౌష్టికాహారం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేయడం జరిగింది.
జీవన నైపుణ్యాలు మెరుగుపడాలంటే
సృజనాత్మకంగా ఆలోచించడం
విమర్శనాత్మకంగా ఆలోచించడం
సమస్య పరిష్కారం దిశగా ఆలోచించడం
సహానుభూతి కలిగిఉండడం
ఆత్మపరిశీలన చేసుకోవడ వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం
బావో ఉద్రేకాలను, ఒత్తిడిని తగ్గించుకోవడం
పిల్లలకు ఆరోగ్య విద్యా బోధన చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కస్తూరిబా ఎస్. ఓ సరోజీని , కే వై డి పి ఓ సత్యనారాయణ గారు, హెచ్. ఈ. ఓ వేణు గోపాల కృష్ణ , హెచ్. ఎస్ రామ్ ప్రసాద్ మరియు పుష్పావతి,ఏఎన్ఎం స్వరూప, ఆ విద్యాలయం సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: