CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా చాకలి ఐలమ్మ 127 జయంతి వేడుకలు పూలమాలలు వేసి నివాళులర్పించిన విప్ రేగా కాంతరావు

Share it:


మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని హనుమాన్ టెంపుల్ వద్ద చాకలి ఐలమ్మ 127 జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ సాయుధ పోరాటంలో ధీరవనిత చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాట పటిమ నేటి సమాజానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో విప్లవాగ్ని గా నిలిచి నిజం నవాబు గుండెల్లో వణుకు పుట్టించిదన్నారు. భూమికోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం  పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాడి స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మన తెలంగాణ వీరవని చాకలి ఐలమ్మ అన్నారు.తెలంగాణ రాష్ట్రం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలు ఎంతో స్ఫూర్తిదయకం అన్నారు.నాడు తెలంగాణ ఉద్యమాన్ని రైతాంగ సాయుధ పోరాటంగా మార్చిన చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చీర స్మరణీయమని అన్నారు. చాకలి ఐలమ్మ సాహసాన్ని నేటితర ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రేరణ కలిగించిందని,తెలంగాణ ఉద్యమాన్ని రైతంగా పోరాటంగా మార్చిందని తెలియజేశారు.భూస్వామ్య వ్యవస్థను కూల్చి,దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరించిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాకలి ఐలమ్మకు తగిన గుర్తింపు లభించింది అని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రజకుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.ప్రతి గ్రామంలో ధోబి ఘాట్ నిర్మాణానికి,రజక సంఘాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,కో-ఆప్షన్ సభ్యులు జావీద్ పాషా, మండల,టౌన్ అధ్యక్షులు ముత్యం బాబు,అడపా అప్పారావు,ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు,ముత్యాలమ్మ నగర్ సర్పంచ్ కొమరం. జంపేశ్వరి,రజక సంఘం మణుగూరు మండలం అధ్యక్షుడు ధర్మరాజుల శంకరయ్య,జిల్లా ఉపాధ్యక్షులు చిటికెన భాస్కర్ రావు,మండల సీఐ ముత్యం రమేష్,టీఆర్ఎస్ నాయకులు ఖమ్మం పాటి శ్రీను, యాదగిరి గౌడ్,హర్షవర్ధన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: