CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు వినతి -ముఖ్యమంత్రి హామీని నెరవేర్చే వరకు ఆందోళన విరమించేది లేదు.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏల జేఏసీ పిలుపుమేరకు అశ్వరావుపేటలో వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో రింగ్ రోడ్డు సెంటర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాయకులు రమేష్ మాట్లాడుతూ వీఆర్ఏలకు ముఖ్యమంత్రి ఇచ్చిన న్యాయమైన తమ కోర్కెలను తీర్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా 09/09/2020 తేది నాడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వీఆర్ఏ లకు పే స్కేల్ జీవోను విడుదల చేసి, వెంటనే అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని, తమ వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్వోల వ్యవస్థ రద్దయిన తర్వాత మల్టీపర్పస్ ఉద్యోగులుగా తమను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా, రికార్డు వర్క్స్, ఎలక్షన్ డిపార్ట్మెంట్ పనులు, గ్రామాలలో భూములకు సంబంధించిన పనులు, ఇలా అనేక రకాలుగా మమ్ములను వాడుకుంటున్నప్పటికీ మేము సంతోషంగానే విధులు నిర్వహిస్తూ వస్తున్నామని, అది తక్కువ జీతాలతో కుటుంబాలు వెళ్లదీసే పరిస్థితి లేదని, మా బాధలు చూసే ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అనేక వాగ్దానాలు చేశారని, ముఖ్యమంత్రి హామీ మేరకు మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు తహాశీల్దార్ కార్యాలయం ముందు నిరవదిక సమ్మె కొనసాగిస్తామని వారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు దాసరి శ్రీనివాసరావు, ఊకే రమేష్, చిలకారావు, సత్యనారాయణ, జక్కుల ఏసు, బానోతు నాగరాణి, జొన్నలగడ్డ నాగేష్, వెంకటేశ్వర్లు, రాము, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: