CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్వాతంత్ర వజ్రోత్సవాలు సందర్భంగా ఏటూరు నాగారంలో ఫ్రీడమ్ రన్

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

స్వాతంత్ర 75వ వజ్రోత్సవాల సందర్భంగా ఏటూరు నాగారం సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో "ఫ్రీడమ్ రన్"నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో అంకిత్ ఐఏఎస్,ఏటూరు నాగారం ఏఎస్ పి అశోక్ కుమార్ ఐపీఎస్ హాజరై "ఫ్రీడమ్ రన్"ను ప్రారంభించారు.అనంతరం ఐటిడిఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ. స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ"ఫ్రీడమ్ రన్" కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం ఇంకా శుభపరిణామం అని అన్నారు.ఈ "ఫ్రీడమ్ రన్ లో ఏటూరు నాగారం స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు మహిళల విభాగంలో ఎండి కరిష్మా మొదటి బహుమతి,పురుషుల విభాగంలో రవీందర్ మొదటి బహుమతి,ఐతుర్ తృతీయ బహుమతులు గెలుచుకున్నారు.విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, క్రీడాకారులకు,బహుమతులు ప్రధానోత్సవం చేశారు.ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం మండల ప్రత్యేక అధికారి జడ్పీ సీఈవో రమాదేవి,స్థానిక తాసిల్దార్ సంజీవ,ఏటూరు నాగారం ఎంపీడీవో కుమార్,ఏటూరు నాగారం సీఐ కిరణ్ కుమార్,ఎస్సై రమేష్,స్థానిక సర్పంచ్ ఈసం రాంమూర్తి,జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబి, ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ,వివిధ శాఖల అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,యువకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: