CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సింగరేణి ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థిని వల్లికకు ఆర్థిక సహాయం.సామాజిక సేవా కార్యక్రమాల్లో మణుగూరు ఏరియా సింగరేణి ఉద్యోగులు స్ఫూర్తిదాయకం టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు వి ప్రభాకర్ రావు

Share it:



మన్యం టీవీ మణుగూరు:


సింగరేణి కాలరీస్ మణుగూరు, ఏరియా మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న సింగరేణి ఫ్రెంట్ లైన్ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం కట్టం వారి గూడెం కు చెందిన గిరిజన విద్యార్థిని కట్టం శ్రీ వల్లిక ఉన్నత చదువులకై రూ.8,000 రూపాయలను,అధికారులు, కార్మిక సంఘాల నాయకులు మరో 4000 రూపాయలను మొత్తం రూ.12 వేల రూపాయలను శుక్రవారం మధ్యాహ్నం పైలట్ కాలనీ ఎం వి టి సి లోని శ్రీ సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో విద్యార్థిని శ్రీవల్లికకు ఆర్థిక సహాయం అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.ఏరియా గుర్తింపు సంఘం ఉపాధ్యక్షులు వి ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు, పని సంస్కృతిలోనే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా మణుగూరు ఏరియా కార్మికులు సూపర్వైజర్లు అధికారులు ఇతరులకు స్ఫూర్తిదాయకమని,సునామీ కావచ్చు,గోదావరి వరదలు అగ్ని ప్రమాదాలు వృద్ధులు నిరుపేదలు,అనారోగ్య బాధితులు,పేద విద్యార్థులు కావచ్చు,ఎవరు కష్టాల్లో ఉన్న ఆదుకునే స్వభావాన్ని కలిగి ఉంటారని ఇది మణుగూరు ఏరియాకు కంఠాభరణం అని ఆయన ప్రశంసించారు. ముందుండి ఫ్రంట్ లైన్ ఆర్థిక సాయం చేసిన ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లను ఆయన అభినందించారు.దాతల సహకారంతో శాస్త్రవేత్త కావాలనే తన సంకల్పాన్ని నిజం చేసుకోవాలని ఆయన శ్రీవల్లిక తో అన్నారు.గిరిజన విద్యార్థిని శ్రీవల్లిక పై చదువుల పై రెండు రోజులలో రూ.23 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత కార్యక్రమం లో ఎంతగానో కృషిచేసిన ఎంపీటీసీ అధికారులను సిబ్బందిని ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఎంవిటిసి మేనేజర్ జి.నాగేశ్వరరావు, అడిషనల్ మేనేజర్ జి లక్ష్మణ్, ఏరియా పర్యావరణ అధికారి శ్రీనివాస్,శిక్షకులు భోగ శంకరయ్య,కీర్తి శ్రీనివాస్, గుర్తింపు సంఘం నాయకులు కోటా శ్రీనివాస్,పీక శంకర్,ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు వి శ్రీకాంత్, ధారా సూర్య,కిరణ్ కుమార్, ప్రవీణ్,కె.శ్రీనివాస్,బిఎస్ జోన్స్, రాగన్ బాబు,నారాయణ, కిరణ్ కుమార్,నగేష్, పాండురంగయ్య,ఎం కుమార్, కళ్యాణ్ బాబు,శివకుమార్, సూర్యతేజ,ప్రేమ్ కుమార్, సుమిత్,సుదర్శన్ సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా,ఎంపీటీసీ సిబ్బంది అజయ్,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: