CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు బియ్యం నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత రెడ్డి..

Share it:



మన్యం టీవీ మణుగూరు:


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు,రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి గార్ల సహకారంతో బూర్గంపాడు గ్రామ పంచాయతీ లో ముంపు బాధితులకు బియ్యంతో పాటుగా నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత రెడ్డి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,ప్రభుత్వం తరఫున రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.ప్రజా సంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్, అహర్నిషలు కృషి చేస్తున్నారని గోదావరి పంపు ప్రాంత ప్రజలకు అండగా ఉంటామని ఆమె అన్నారు.గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు,రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి సహకారంతో కోటి రూపాయలతో పినపాక నియోజకవర్గం లో 13 వేల కుటుంబాలకు బియ్యంతో పాటుగా పలు రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.అదే విధంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క బాధితుడికి బ్యాంకు ఖాతాలో రూ.10,000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు.2 నెలల పాటు 25 కిలోలు బియ్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వరద బాధితుల కోసం సుమారు 1000 కోట్ల రూపాయలతో ఎత్తైన ప్రదేశాలలో ప్రభుత్వం ఇల్లు నిర్మాణాలను,చేపడుతుందన్నారు.భవిష్యత్తులో గోదావరి వరద ఉధృతకి గ్రామాలు మునగడం,ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సహకారం పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న,మాజీ సర్పంచ్ జక్కం సుబ్రహ్మణ్యం,టిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని,సొసైటీ డైరెక్టర్ బొల్లు రవి,మైనారిటీ మండల అధ్యక్షులు,సాదిక్,సాబీర్ పాషా,సోహెల్ పాషా 

వార్డు సభ్యులు సౌకత్, సంపత్ టిఆర్ఎస్ నాయకులు తోకల సతీష్,గంగరాజు యాదవ్, చెన్నం రవి,కన్నేపళ్లి సతీశ్, మందా ప్రసాద్,కేసూపాక మహేష్,షబాజ్,రాగవులు, మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు,గ్రామస్తులు,పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: