CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజన మహిళ సర్పంచ్ అంటే అంత చిన్న చూపా. పిసా గ్రామ సభలో సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన తాసిల్దార్ చంద్రశేఖర్.. .

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

వివాదాలకు ముందు వరుసలో ఉండే ప్రభుత్వాధికారి తాసిల్దార్ చంద్రశేఖర్ గతంలో ఎక్కడ పనిచేసిన అక్కడ కూడా వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి ఈ తరుణం లోనే పర్ణశాల గ్రామపంచాయతీ లో నిర్వహించిన గ్రామసభలో ఒక ప్రధమ పౌరురాలు స్థానం ఉన్నటువంటి గిరిజన మహిళా సర్పంచ్ తెల్లం వరలక్ష్మి అడిగిన ప్రశ్నకు ఎటువంటి వివరణ ఇవ్వకుండా సభ మధ్య నుంచి వెళ్లిపోవడం గిరిజన మహిళా సర్పంచ్ అంటే అంత చిన్న చూపు అనే చర్చకు దారి తీసింది వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోజు గతంలో సీతమ్మసాగర్ ప్రాజెక్టు వలన కోల్పోయిన రైతులకు కొత్తగా వచ్చిన లిస్ట్ ప్రకారం కొంతమంది రైతుల భూములు కోల్పోలేదని చెప్పడానికి పిసా గ్రామసభ నిర్వహించారు అయితే ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచికి సమాచారం అందించారు ఈ సభ నిర్వహిస్తుండగా గత కొన్ని రోజుల క్రితం గోదావరి వరదల కారణంగా నీటి మునిగిన ఇళ్ల వివరాలలో అవకతవకలు ఉన్నాయని సర్వం కోల్పోయిన ప్రజలకు న్యాయం జరగక ఇక్కడ ఉన్న ఒక ప్రజా ప్రతినిధి సాయంతో తప్పుడు సర్వే చేపించి బాధితులకు 10000 రూపాయల సాయం అందకుండా ముంపుకు గురికానటువంటి వ్యక్తులకి ఒక వీఆర్ఏ సాయంతో తప్పుడు సర్వే చేపించి వారికీ 10000 సహాయం చేశారని కానీ సర్వం కోల్పోయిన ప్రజలకు అన్యాయం జరిగిందని ఈరోజు గ్రామసభకు పిలిచిన నన్ను వరద బాధితుల పేర్లు నమోదు చేసేటప్పుడు ఎందుకు సమాచారం అందించలేదని సర్పంచ్ వరలక్ష్మి ప్రశ్నించారు ఈ సమస్యపై అధికారులను ప్రశ్నిస్తున్నప్పుడు కనీసం తాసిల్దార్ చంద్రశేఖర్ సమాధానమివ్వకుండా వెళ్లిపోవడం గిరిజన సర్పంచ్ గా నన్ను అవమానించడమేనని తెలియజేశారు వరద బాధితులకు న్యాయం జరగకపోతే ఉన్నత అధికారులకు కలుస్తామని ఇక్కడ జరిగిన అవినీతిని అధికారులు తెలియజేసి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు...

Share it:

TS

Post A Comment: