CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పచ్చని అడవుల మధ్య ఎత్తైన గుట్టలపై నుంచి వయ్యారాలు ఒలకబోస్తూ నురగలు కక్కుతూ కిందకు జాలువారుతున్న ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని గుండ్ల వాగు ప్రాజెక్టు

Share it:

 


పచ్చని అడవుల మధ్య ఎత్తైన గుట్టలపై నుంచి వయ్యారాలు ఒలకబోస్తూ నురగలు కక్కుతూ కిందకు జాలువారుతున్న ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని గుండ్ల వాగు ప్రాజెక్టు అందాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి. తమ అందాలతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. పేరుగాంచిన పెద్ద పెద్ద జలపాతాలే కాకుండా ఈ వర్షాకాలం మాత్రమే కనిపించే చిన్న చిన్న జలపాతాలు కూడా కనువిందు చేస్తున్నాయి. వరుసగా రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి తోడు, ఎగువ ప్రాంతాల నుండి కొనసాగుతున్న వరద ఉధృతికి గుండ్ల వాగు ప్రాజెక్టు జల కళను సంతరించుకుంటున్నాయి. కొండల మీది నుండి శబ్దం చేస్తూ కిందికి దూకుతూ కనువిందు చేస్తున్నాయి. 


వయ్యారాలు ఒలకబోస్తూ కనువిందు చేస్తున్న గుండ్ల వాగు ప్రాజెక్ట్..!




మన్యం మనుగడ/వాజేడు: ఆగస్టు 16: వాజేడు మండలంలో గ్రామాలు ప్రకృతి ఒడిలో ఉన్నట్లు, గ్రామాల భౌగోళిక సరిహద్దులు దాటి ముందుకు వెళ్ళగా అక్కడ అంతా అద్భుతమైన వాతావరణ పరిస్థితులు కనబడుతుంటాయి, మండలంలో గుండ్ల వాగు ప్రాజెక్ట్, ప్రకృతి ప్రియులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సెలవు దినాలలో మరో పర్యటక కేంద్రంగా ఉంది.ఈ అద్భుతమైన గుండ్ల వాగు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించాలని, లక్నవరం,పాకాల చెరువు, అదే తరహాలో గుండ్ల వాగు ప్రాజెక్టు ను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని.స్థానిక ప్రజలు, పర్యటకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రాజెక్టుకు వెళ్లడానికి రహదారి సౌకర్యం కూడా ఉంది. మురుమూరు గ్రామపంచాయతీ, కొప్పుసురు గ్రామం నుండి సుమారు ఒక కోసంత దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, చర్ల మండలం తాలుపేరు ప్రాజెక్ట్, వాజేడు మండలంలో గుండ్ల వాగు ప్రాజెక్ట్, రైతులకు సాగు, త్రాగునీరు అందించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్స్ కానీ అన్యోన్య కారణాలవల్ల నిలువ నీరు లేకపోవడం వల్ల చుట్టుపక్కల చేనులు, బీడువారిపోతున్నాయి. పర్యటక కేంద్రంగా ప్రభుత్వం గుర్తించి, అభివృద్ధి చేయాలని స్థానిక సర్పంచ్, పూసం నరేష్ కుమార్, స్థానిక గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఈ గుండ్ల వాగు ప్రాజెక్ట్ ప్రకృతి అందాలను వీక్షించడానికి ములుగు జిల్లా వైస్ చైర్మన్,బడే నాగజ్యోతి, వారి కుటుంబంతో సందర్శించి వీక్షించారు.

Share it:

TS

Post A Comment: