CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు.. వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ డా. వినీత్, ఏఎస్పి రోహిత్ రాజు..

Share it:


మన్యం టీవీ,దుమ్ముగూడెం/ చర్ల :

మావోయిస్టులు పార్టీ సభ్యులు అడవి జీవితాన్ని వీడి జనజీవనన్నస్రవంతిలో కలిసి బ్రతకాలని పోలీసువారికి లొంగిపోవాలని కోరుతూ వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహం అందిస్తామని చర్ల పోలీసులు సూచనలు మేరకు ఈరోజు ఇద్దరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సెక్షన్ కమాండర్ వేకో దేవ/సందీప్ (25) యంపురం గ్రామం పామేరు బీజాపూర్ జిల్లా, మలేషియా సభ్యుడు మడివి పొజ్జ (23) తుమ్రేలు గ్రామం పామేడు బీజాపూర్ జిల్లా చత్తిస్ గాడ్ రాష్ట్రానికి చెందిన ఇరువురు భద్రాది కొత్తగూడెం జిల్లా పోలీసులు, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయారు. దేవా 2017 సంవత్సరంలో పామేడు ఎల్వోఎస్ కమాండర్ కమల ఆధ్వర్యంలో  పామేడు ఎస్వైఎల్ సభ్యుడిగా చేరి ఆరు నెలల తర్వాత దండకారణ్యం పశ్చిమ బస్తర్ డివిజన్లో రెండో కంపెనీలో దళ సభ్యులుగా బదిలీ అయ్యాడు అనంతరం 2001 సంవత్సరంలో దళ సభ్యుడు నుండి ఏ సి ఎం కమాండర్ గా అదే దళంలో పదోన్నతి పొందాడు అతని దగ్గర ఎస్ఎల్ఆర్ ఆయుధం కలిగి ఉంది ఇతను పశ్చిమ బస్తర్  డివిజన్లో అన్ని ఏరియాల్లో మావోయిస్టు కార్యకలాపల్లో చురుగ్గా పాల్గొని విధ్వంసంఘటనలో ప్రముఖ పాత్ర పోషించాడు అలానే మడివి పోజ్జ 2019 సంవత్సరంలో కోమటిపల్లి ఆర్పిసి మిలిషియా కమాండర్ ఆధ్వర్యంలో మిలీషియా  సభ్యునిగా పనిచేస్తున్నాడు ఇతను 12 బోర్ ఆయుధాన్ని కలిగి ఉండి దండకారణ్య దక్షిణబస్తరు డివిజన్లో వివిధ  సంఘటనలు పాల్గొన్నారు 2022 ఫిబ్రవరి బాసగూడా  పోలీస్ స్టేషన్ పరిధిలో పోలంపల్లి వద్ద సిఆర్పిఎఫ్ పోలీసులపై అలానే కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఆర్పి క్యాంప్ పై దాడి ఘటన పాల్గొన్నారు. వీరు లొంగి   పోవడానికి మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలతో విసిగిపోయి ఆదివాసి ప్రజల అభివృద్ధికి మావోయిస్టు పార్టీ అడ్డంకులుగా మారుతుందని అమాయక మైనర్ ఆదివాసి బాలబాలికలను బెదిరిస్తూ బలవంతంగా పార్టీలో వివిధ కార్యకలాపాలకు వాడుకుంటున్నారని అందువల్లనే మావోయిస్టు పార్టీ తట్టుకోలేక లొంగిపోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునేవారు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో గాని, బంధుమిత్రుల ద్వారా గాని, నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు లొంగిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చర్ల సీఐ అశోక్ ఎస్సై రాజు వర్మ సిఆర్పిఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: