CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజాస్వామ్యం, పరాకాస్టేనా

Share it:

  • స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్న నేటికీ,  ప్రజాస్వామ్యంలో ఏమైనా మార్పు వచ్చిందా!
  • ఈ దేశంలో పాలక ప్రభుత్వలు ఏ విధమైన విధానాలను అనుసరిస్తున్నాయి, ప్రభుత్వల సిద్ధాంతం ఏంటి!                                       
  • వయోజన ఓటు హక్కు కే ప్రజాస్వామ్యాన్ని మార్చే శక్తి ఉందా !                                                        నిస్వార్థ రాజకీయాల కోసం, ప్రజల కోసం, ప్రగతి కోసం, ప్రజల సంక్షేమం కోసం, పాటు పడే వారికి  ఈనాటి రాజకీయాల్లో స్థానం ఉందా!                   


మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 25: 

76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రత్యేకంగా ఎంత శాతం మేర అభివృద్ధి సాధించాము, ప్రభుత్వ సంస్థలు ఏ విధానాలు అవలంబిస్తున్నాయి, పాలక ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి,భారతదేశ రాజ్యాంగనికి లోబడి పరిపాలన సౌలభ్యం చేస్తున్నారా, ఇలాంటి అనేక అంశాలను ప్రజాస్వామ్యవాదులు, ప్రశ్నిస్తున్నారు.                                    

ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉందా! స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో పండగల సంబరాలు జరుపుకుంటున్నరు,కానీ ఈ దేశ ఆదివాసి కు, దళితులకు, బీసీలకు, మైనార్టీల, ప్రజలకు స్వతంత్రం వచ్చిందా, ఈనాటికి 70% ప్రజలకి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకుండా పోవడం నిజంగా స్వతంత్రం వచ్చినట్టేనా, ముఖ్యంగా ప్రపంచ చరిత్ర పునాదులైన ఆదివాసీల పరిస్థితి ఏంటి, రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు స్వయం పాలన, ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలో స్పష్టంగా ఆదివాసీల పరిపాలన లిఖించబడింది. అటానమాస్ కౌన్సిల్ ద్వారా పరిపాలన సౌలభ్యం చెయ్యాలి, చేస్తున్నారా,

1/70,పీసా, ఎల్ టి ఆర్, చట్టాలను నిర్వీర్యం చేస్తే, చట్ట ఉల్లంఘన చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి, తీసుకుంటున్నారా, ఈ ఆధునిక యుగంలో అంతరిక్షంలోకి రాకెట్లు దూసుకుపోతుంటే ఆదివాసీల భవిష్యత్తు, ఆదివాసీల పరిస్థితులు, మాత్రం ఆకలేస్తే ఆకాశానికి  నీళ్లు వేస్తే నేలకి చూసే పరిస్థితి ఉందంటే, ప్రభుత్వాలు సిగ్గుపడాలి, ఆదివాసీలు ప్రస్తుత పరిస్థితులలో కూడా ప్రకృతి పై, సహజ సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. చట్టాలు పూర్తిస్థాయిలో అమలు చేస్తేనే ఆదివాసీలకు స్వతంత్రం వచ్చినట్లు కదా, ఈ పాలక ప్రభుత్వాల సుడిగుండంలో ఆదివాసీల చట్టాల పరిస్థితి అగమ్యోగోచరంగా మారింది. ఈ పాలక ప్రభుత్వాలు ఆదివాసి చట్టాలను ఇంప్లిమెంటేషన్       ఇంకా ఎన్ని దశాబ్దాలు దాటివేస్తారు.

*ఆధునిక ప్రజాస్వామ్యం ఏం చెప్తుంది.

 75 సంవత్సరాల స్వతంత్ర భారత వణిలో ప్రజాస్వామ్యం సాధించింది ఏంటి, ప్రజాస్వామ్య ముసుగులో పార్టీలు రాజ్యమేలుతున్నాయి, రాజకీయ పార్టీల వ్యవహార శైలి, అదే పార్టీ పాలక ప్రభుత్వంలో ఉంటే      ఏకచత్రాధిపతిగా చక్రం తిప్పేస్తుంటారు. అలా 76 సంవత్సరాలు సుదీర్ఘ పాలనలో ప్రజలను పరిపాలనకు దూరంగా ఉండేటట్టు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వం చేసే పనులపై ప్రజలకు అవగాహన లేక ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు.                        ఈ సుదీర్ఘ ప్రజాస్వామ్య పాలనలో ఆదివాసులకు, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు, అభివృద్ధి పట్ల పాలకులు ప్రశ్నించుకోవాలి. ఆదివాసి ప్రజలలో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు ఘటిస్తున్న ఆదివాసిలలో 42 శాతం ప్రజలకు విద్య అందడం లేదు, ప్రధానంగా 100%  విద్యపై అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రం దేశంలో ఆదివాసీలు సంపూర్ణ అభివృద్ధి చెందుతారు. పాలక ప్రభుత్వాల పాలనలో  100 కి 70% రాష్ట్రాలలో పరిపాలన నేటికీ రహదారుల సౌకర్యం లేదు, స్కూల్స్ లేవు, వైద్య సౌకర్యం లేదు,  సగటు మానవుని మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకు, ఇంకా ఎన్నాళ్లు ఈ పాలనలు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు రాదా, ప్రజాస్వామ్యం అంటే, ఎన్నికల సందర్భంలో ఉచిత హామీలు ఇవ్వడమేనా! ప్రజాస్వామ్యం అంటే ఓట్లు కొనుక్కోవడంమేన, ప్రజాస్వామ్యం అంటే ఒక్క నియోజకవర్గానికి వందల కోట్లు ఖర్చు చేయడమేనా, అసలు నిజమైన ప్రజాస్వామ్యం ఈ దేశంలో బ్రతికి ఉందా!                                 సామాన్య మానవులు, నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయాలనే వారికి, ప్రజల ప్రగతికి బాటలు వెయ్యాలనుకునే వారికి, రాజకీయ ప్రవేశం చేస్తే వారి పరిస్థితి ఏంటి!  ఎన్నికలు వచ్చాయంటే చాలు రాత్రికి రాత్రి వందల కోట్ల రూపాయలు నల్ల డబ్బు వైట్ మనీ గా చలామణి అవుతుంది.ఒక్కో నియోజకవర్గానికి 100 కోట్లు రూపాయలు ఖర్చు అవుతుంది, ఈ ప్రజాస్వామ్యంలో పార్టీలో టికెట్ రావాలంటే, టికెట్ వచ్చాక గెలవాలంటే ప్రజలకు డబ్బులు ఇవ్వవలసిందే, లేకపోతే అటు పార్టీకి ఇటు ప్రజలలో పట్టం కట్టే పరిస్థితి లేదు, ఇలాంటి  సందర్భంలో చట్టసభలలో కోట్లకు పరిగెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజల కోసం, విలువల కోసం, సిద్ధాంతాల కోసం, పనిచేసేవారు మచ్చుకైనా కానరాట్లేదు,కోట్లు ఖర్చుపెట్టి గెలిచిన వారు లక్షల కోట్లు సంపాదించాలని అనుకుంటున్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచించేవారు లేరు, ఇదేనా మనం కలలు కన్న ప్రజాస్వామ్యం, ఎక్కడుంది ప్రజాస్వామ్యం, కార్పొరేట్ ప్రజాస్వామ్యంగా మారబోతుంది ఈ కార్పొరేట్ ప్రజాస్వామ్యం దేశానికి చాలా ప్రమాదకరం, ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థ, అంచలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థ చెందిన వారే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా అయితే ప్రజాస్వామ్య పరిస్థితి ఏంటి, ఈలాంటి విన్న అభిప్రాయాలు ప్రజలలో వెల్లడవుతున్నాయి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొరకు  బాబా సాహెబ్ అంబేద్కర్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కుని కల్పించారు.  పవిత్రమైన ఓటును బిర్యానీ ప్యాకెట్కో, సారపాకిటికో, వెయ్యి, రెండు వేల రూపాయలకు, అమ్ముకునే సంస్కృతిని పాలకులు తమ స్వార్థానికి బానిసలలుగా చేశారు. ఇదేనా మనం కలలు కంటున్న ప్రజాస్వామ్య వేదిక, ఇదేనా 75 సంవత్సరాల    ప్రజాస్వామ్య దేశం.                                       ప్రజాస్వామ్య వాదులారా కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని .

Share it:

TELANGANA

Post A Comment: