మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని శ్రీరామ హాస్పిటల్ నిర్వాహకులు ఎగ్గడి శ్రీరాం పినపాక మండల గ్రామీణ వైద్యులకు మంగళవారం గోడ గడియారాలు వితరణ గా అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక కష్టాలను ఎదుర్కొంటూ మారుమూల గ్రామాలలో సైతం తమ అమూల్యమైన సేవలందిస్తున్న గ్రామీణ వైద్యుల సేవలు మరువలేనివని, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటే భయపడే ప్రజానీకానికి, ఉన్నంతలోనే వైద్యం అందించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు సతీష్,నర్సింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: