CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా ఆజాదికా అమృత మహోత్సవ్.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండల కేంద్రం లో బీజేపీ శ్రేణులఆధ్వర్యంలో ఘనంగా ఆజాదిక అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలో భాగంగా ములుగు జిల్లా బిజెపి అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి మంగపేట లో పార్టీ శ్రేణులను కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ములుగు జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఏమీ లేదని, రెండు పర్యాయాలు ఎన్నికైన ఎమ్మెల్యే సీతక్క చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు.పాద యాత్ర లో సీతక్క మాట్లాడుతూ బీజేపీ పై అనవసరమైన విమర్శలు చేస్తూ జాతీయ జెండా ఎగరవేయడానికి బిజెపి నిరాకరించిందని ఇప్పుడు బిజెపి వాట్సాప్ డీపీ గా పెట్టుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు .నా ,మా ,మన అనే భావంతో దేశం కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీయే అని చెప్పుకొచ్చారు.భారత్ మాతాకీ జై అనే నినాదం తో వందేమాతరం గీతం పాడటం ప్రతి సమావేశంలో బిజెపి చేస్తోందని చివరగా జనగణమన గేయం పాడిన తర్వాతనే ప్రతి కార్యక్రమాలు ముగిస్తుందని చెప్పుకొచ్చారు. అలాంటి అంకితభావం బిజెపి పార్టీ దేశం పట్ల దేశ ప్రజల పట్ల చూపిస్తుందని దేశ ప్రజల కోసమే ప్రతిక్షణం ఆలోచిస్తుంది అని దేశం పట్ల గౌరవాన్ని బిజెపి శ్రేణులకు కూడా నేర్పిస్తుంది అన్నారు. అలాంటి బీజేపీపై జాతీయ జెండా పట్ల గౌరవం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని దీనిని ఖండించారు. గతంలో స్వతంత్ర దినోత్సవాన్ని బ్లాక్ డేగా గుర్తించాలని చెప్పిన సీతక్క లాంటి వాళ్ళతో నీతులు చెప్పించుకునే స్థాయిలో బీజేపీ లేదని చెప్పారు. బిజెపి గురించి మాట్లాడే సమయంలో దేశంలో ప్రజల విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ స్థాయి గుర్తించుకోవాలని హెచ్చరించారు.వచ్చే ఎన్నికల్లో ములుగు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెసుకు, టీ ఆర్ ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ ,జిల్లా సీనియర్ నాయకులు తక్కలపెల్లి దేవేందర్, రాష్ట్ర బీజేయం కార్యవర్గ సభ్యుడు దొంతిరెడ్డిజిల్లా బీజేవైఎం అధ్యక్షులు కొత్త సురేందర్ ,జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గద్ధల రఘు,జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరన్ కుమార్ గారు లోడే శ్రీనివాస్ , జిల్లా కిసాన్మోర్చా ఉపాధ్యక్షులు దంతనపెళ్లి నరేందర్, జిల్లా దళిత మోర్చా కార్యవర్గ సభ్యులు జడి రాంబాబు, జిల్లా మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు ఇజాజ్ ఖాన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు గందశిరి శ్రీనివాస్, బీజేయం జిల్లా కార్యదర్శి బొంబోతుల మురళి,చందా మహేష్,మండల నాయకులు గాదె శ్రీనివాస్ చారి,పులిచర్ల వెంకటేశ్వర్లు,బూర సుధాకర్, ముంజంపల్లి మధుకర్, బూర నవీన్ బొడిగే మధుకర్,ఈక రాకేష్ ,బట్టా సాంబశివరావుతదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: