CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్విట్ ఇండియా స్ఫూర్తి తో చేపట్టిన పాదయాత్రలో ఎమ్మెల్యే సీతక్కకు ప్రజల అపూర్వ స్వాగతం.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ఎ.ఐ.సి.సి, టి.పి.సి.సి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క క్విట్ ఇండియా స్ఫూర్తితో చేపట్టిన పాదయాత్ర రెండవ రోజు దేవగిరిపట్నం,జంగాల పల్లి,కాశిందేవి పేట, రాంనగర్ తండాలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే సీతక్క ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గజ మాల తో మహిళల కొలాటాలతో 

 కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళ హారతులతో పూల దండలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామ ప్రజలు ములుగు ఎమ్మెల్యే సీతక్కకి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ

రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ ఎన్నికల సమయం లో డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్ రూం ముద్దు అన్నట్లు ఇచ్చిన మాట ప్రకారం పేదలకు డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలి రైతులకు ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫి చేయాలి అని గడచిన 4 యేండ్ల నుండి ఒక్క పెన్షన్ ఇవ్వని పరిస్థితి ఉందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం అని స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో జాతీయ జెండానుఎగురవేయడానికి నిరాకరించిన బీజేపీ పార్టీ ఇప్పుడు జాతీయ జెండాను వాట్సప్ డీపీ పెట్టుకోమనడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. నిజమైన దేశ భక్తి డీపీలు పెట్టుకోవడంలో ఉండదు. కుల, మత, వర్గ, లింగ వివక్షలు లేకుండా, ఆర్ధిక, సామాజిక వివక్షలు కొనసాగకుండా మానవత విలువలతో బ్రతుకుతూ, గౌరవ మర్యాదలతో ప్రతి ఒక్కరు ఉంటే అది నిజమైన దేశ భక్తి అని అన్నారు. 8 ఏండ్ల బీజేపీ పాలనలో ఒక్క విజయవంతమైన సంక్షేమ పథకం లేదు. నోట్ల రద్దుతో నల్ల ధనాన్ని వెనక్కు తీసుకుని వచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జి.ఎస్.టి. ద్వారా మనం తాగే నీరు దగ్గరి నుండి మనం కట్టుకునే బట్ట, చివరకు రాసుకునే పెన్ను, పెన్సిల్ పై కూడా వేసి పేదవాడి రక్తం తాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆహార భద్రత చట్టం, భూ సంస్కరణల చట్టం, ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించి అటవీ హక్కుల చట్టం చేస్తే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని తొలగించి అటవీ శాఖ అధికారులతో గిరిజనులపై అక్రమ కేసులు బనాయిస్తూ ఆదివాసీలపై కపట ప్రేమలు చూపిస్తున్నారని అన్నారు. ఈ ఎనిమిది ఏండ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి సామాన్యుడు బ్రతకలేని స్థాయికి తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను, ఆర్.టి.సి. చార్జీలను పెంచి సామాన్యుడిని ఇంకా అధః పాతాళానికి తొక్కేలా చేసిందని అన్నారు. నిర్దిష్ట ప్రణాళిక లేని పథకాలతో, ఆర్ధిక స్థితిగతులను అంచనా వేయలేక తెలంగాణ రాష్ట్రం తీవ్ర అప్పుల్లోకి కూరుకుపోయింది అని అన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసి యువత భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతున్నాయని అన్నారు. ఇంతవరకు ములుగు జిల్లాకు మంజూరు అయిన గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ వెంటనే ప్రారంభించాలని, అలాగే ములుగుకి బస్ డిపో కట్టించాలని, వరదల వలన నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, ములుగు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సీఎం కేసీఆర్ ఇస్తానని చెప్పిన నిరుద్యోగ భృతి, ఏకకాలంలో లక్ష రూపాయల పంట రుణమాఫీ, పోడు భూములకు పట్టాలు, రెండు పడకల గదులు, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత విద్య, ప్రతీ మండలంలో 100 పడకల ఆసుపత్రులు, గిరిజన, మైనారిటీలకు 12% రిజర్వేషన్లు పెంపు లాంటి పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఇకనైనా మేలుకోండి ప్రజలారా అధికార పార్టీలు ఒకరికి ఒకరు కుమ్మక్కు అయి దోచుకువడానికి ఒకటి దోచుకున్నది దాచుకోవడానికి ఇంకొక పార్టీ అన్నట్లు పాలన చేస్తున్నారు తప్ప ప్రజల కొరకు వారు పరిపాలన చేయట్లేదని ఇప్పటికి అయిన ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, పేదలకు ఇండ్లు ఇచ్చినా, పోడు భూములకు పట్టాలు ఇచ్చిన, పనికి ఆహార భద్రత కల్పించిన, వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ ఇచ్చిన, సబ్సిడీ ఎరువులు విత్తనాలు ఇచ్చిన, పంట రుణమాఫీ చేసిన, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన విద్యార్థుల పై చదువుల కొరకు ఫీజ్- రీ యింబర్సుమెంట్ ఇచ్చిన అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, టిపిసిసి అధికార ప్రతినిధి రవళి రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవి చందర్

ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, ఇరుస వడ్ల వెంకన్నమండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ,

వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, రసూపుత్ సీతారాం నాయక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా,మండల,

గ్రామ,అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా సీనియర్ నాయకులు సర్పంచ్, ఎంపీటీసీ

సహకార సంఘం చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: