CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పాటశాలలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో అశ్వారావుపేట గ్రామంలోని బాలికల ఉన్నత పాటశాల నందు (1990-1991) బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో వారీ సహకారంతో సుమారు 60వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేద విద్యార్ధుల ఉన్నత చదువుల కోసం మన ఊరు మన బడి కార్యక్రమాన్నకి శ్రీకారం చుట్టారు. ఎంతో ఖర్చుతో మన ఊరు మన బడి కార్యక్రమం తో పాత పురాతన పాఠశాలలు పునర్నిర్మాణం అలాగే పాటశాలలో కావలసిన అభివృద్ధి పనులు చెపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే అశ్వారావుపేట మండలంలో మొత్తం సుమారు 23 పాఠశాలలు మన ఊరు మన బడి కార్యక్రమం కి సెలెక్ట్ అయినవి అని వాటిలో 21 పాఠశాలలు పనులు జరుగుతున్నాయని, మిగతా పాఠశాలలు కూడా త్వరలోనే పనులు మొదలవుతాయని తెలిపారు. అలాగే నేనూ కూడా ఈ పాటశాలలో చదివిన పూర్వ విద్యార్థిని నే అని ఈ పాఠశాలకు రావాలి అంటే 25 కిలోమీటర్లు ప్రయాణించి రావాలని అందుకే ఇక్కడే ఎస్టీ వసతి గృహంలో ఉండి చదువు కున్నారని అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు గుర్తు చేసుకున్నారు. అలాగే ఈ సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ధ్విసప్తాహంలో భాగంగా ఆగస్టు 08 నుండి 22 వరకు జరిగే వేడుకలకు అన్ని అంతా సిద్ధంగా ఉండాలని, ఆగస్టు 09 వా తరికున ప్రతి ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఎగురవేయటనికి ఇంటింటికీ జాతీయ పతాకాలు పంపిణీ చేస్తారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మాట్లాడుతూ మన అశ్వరావుపేట నియోజకవర్గంలో అశ్వరావుపేట మండలం లో ఉన్న పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమానికి 23 పాఠశాల కావడానికి మన ఎమ్మెల్యే ఎంతో కృషి చేశారని అలాగే ఎంఈఓ కృష్ణయ్య మూడు పదవులు చేస్తూ కూడా పాఠశాలలో అభివృద్ధికి కష్టపడుతున్నారని ప్రశంసించారు. అలాగే ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థులలో తాను కూడా ఒకరిని అని గుర్తు చేసుకున్నారు. పాఠశాలకి ఎటువంటి అవసరం ఉన్న తమకు తెలియజేయాలని ఇప్పటివరకు తెలియజేసిన ప్రతి సమస్యను పంచాయతీ అధికారుల ద్వారా స్థానిక అధికారుల ద్వారా మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ప్రతి సమస్యను పరిష్కరించడం జరిగిందని, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా అశ్వరావుపేట మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్, సర్పంచ్ ఆట్టం రమ్యా, ఉప సర్పంచ్ కేదార్ నాథ్, సొసైటీ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, మోహన్ రెడ్డి, రవి, సంపూర్ణ, వెంకట రమణ, ఎస్ఐ చల్లా అరుణ, ఎంఈఓ క్రిష్ణయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయులు అలాగే పూర్వ విద్యార్థులు, లీలా ప్రసాద్, సుజాత, రవి, శ్రీను, దేవరజ్, సుబ్బారావు, వేంకటేశ్వరా రావు, మసబత్తుల రాము, శ్రీరామమూర్తి, సత్యనారాయణ తదితరుల పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: