CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ

Share it:



  • పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ
  • అభివృద్ధికి కోటి 56 లక్షల నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
  • నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన మార్క్ వేసుకున్న రేగా
  • ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ గుమ్మడి గాంధీ.


మన్యం మనుగడ, పినపాక:


 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిధులు కేటాయించింది. పినపాక మండలంలోని మారుమూల గ్రామాలలో ఉండే ప్రజానీకానికి సైతం ఇప్పటికే తన అమూల్యమైన సేవలు అందిస్తున్న పినపాక ప్రాథమిక కేంద్రం, మరికొన్ని రోజుల తరువాత తన ప్రత్యేక సేవలను అందించనుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన కృషి ఫలితంగా, మారుమూలలో ఉన్న పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం కోటి 56 లక్షల రూపాయల నిధులను కేటాయించింది. కార్పొరేటు ఆసుపత్రులకు ఏమాత్రం తగ్గకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యుడు, సిబ్బంది తమ అమూల్యమైన సేవలను అందిస్తున్నారు. ఈ అభివృద్ధి నిధులతో మరిన్ని పరికరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంటాయని, మండలంలోని ప్రజానీకానికి వైద్యానికి సంబంధించి అన్ని రకాల సేవలు చేస్తారని "మన్యం మనగడ"తో రేగా కాంతారావు మాట్లాడారు. ముందు ఎన్నడూ చూడని అభివృద్ధిని రేగా పరిపాలనలో చూస్తున్నామని, అభివృద్ధిలో తనదైన మార్క్ వేసుకున్నాడని మండల ప్రజానీకం మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుకు, తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: