CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండల స్థాయి క్రీడలలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

Share it:

 


గుండాల/ ఆళ్ళపల్లి:

స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ప్రాంగణంలో మండల స్థాయి ఆటల పోటీలను అధికారులు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలు స్థానిక తహసీల్దార్ మొహమ్మద్ సాదియా సుల్తానా, ఎంపీపీ మంజు భార్గవి,ఎంపీడీవో మందా మంగమ్మ ఆధ్వర్యంలో  నిర్వహించరు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజు భార్గవి మాట్లాడుతూ.. విద్యతోపాటు విద్యార్థులు క్రీడా పోటీల్లో ముందుండాలన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని తెలియజేశారు. చదువుతోపాటు ఆటలకూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ మహమ్మద్ ఖయ్యూం, పీడి కృష్ణ, పీటి రవీందర్, సిఆర్ పీ రామయ్య, ఉపాధ్యాయులు రమేష్, నరేష్, నాగు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: