CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అశ్వారావుపేట లో వరల్డ్ ఫోటోగ్రఫీ డే సంబరాలు, ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ జల్లిపల్లి, సీనియర్ ఫోటోగ్రాఫర్లకు ఘన సత్కారం.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వారావుపేట:నియోజవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 183 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారుల గుండా జాతీయ జెండా చేతపట్టుకుని ఫోటోగ్రాఫర్ల సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం షాదీ ఖానా ఫంక్షన్ హాల్ లో సీనియర్ ఫోటోగ్రాఫర్ కేశి బోయిన వీరాంజనేయులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిదులుగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, గ్రామపంచాయతీ సర్పంచ్ అట్టం రమ్య పాల్గొన్నారు. ముందుగా అతిథులు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కెమెరా సృష్టికర్త అయిన డాగూర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల యూనియన్ అశ్వారావుపేటలో చాలా ప్రతిష్టంగా ఉందని మీ అందరి ఐక్యతను చూస్తే చూడముచ్చటగా ఉందని ఎప్పుడూ కూడా ఈ విధంగానే కలిసి సంఘ ఐక్యతకు ఒకరిని ఒకరు సహకరించుకోవాలని అన్నారు. అలాగే ఫోటోగ్రాఫర్లకు ముద్రా లోన్లు కార్పొరేషన్ లోన్లను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తానని అర్హులైన వారు తమను సంప్రదించగలరని కోరారు. సర్పంచ్ అట్టం రమ్య మాట్లాడుతూ ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఫోటోగ్రఫీకి ఆదరణ బాగా పెరిగిందని ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ సెల్ఫీలు దిగుతున్నప్పటికీ ఏ శుభకార్యమైన ఫోటోగ్రాఫర్ లేనిదే నేడు కార్యక్రమం జరగడంలేదని వారి ప్రాధాన్యత ఎక్కడా కూడా తగ్గలేదని అన్నారు. గ్రామపంచాయతీ సర్పంచిగా తమ పరిధిలో సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అనంతరం యూనియన్ సభ్యులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరాoమూర్తి, సర్పంచ్ అట్టం రమ్యలతో పాటు సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా సాలి గోపి, ప్రధాన కార్యదర్శిగా రంజాన్, కోశాధికారిగా ఇంతియాజ్, గౌరవ సలహాదారుడుగా యార్లగడ్డ రాంబాబు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లు నాగేశ్వరరావు, రఫీ, ఆనంద్, యూనియన్ సభ్యులు వారా రాము, షఫీ, షాజు, ఫ్రాన్సిస్, పల్లెల వెంకటేశ్వరరావు, హుస్సేన్, వెంకటేశ్వరరావు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు సయ్యద్ రఫీ, బ్రహ్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: