గుండాల/ఆళ్లపల్లి ఆగస్ట్ 19( మన్యం మనుగడ) మర్కోడు మా గ్రామంలో ఎస్టి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయడం పట్ల ఆదివాసి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మార్కోడు గ్రామంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ మారుమూల మండలమైన ఆళ్లపల్లి మండలాన్ని గుర్తించి మర్కోడు గ్రామంలో ఎస్టి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, పార్టీ మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు,సర్పంచులు శంకర్ బాబు, ప్రేమ కళ, టిఆర్ఎస్వి నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: