CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శ్రమ దోపిడీకి గురవుతున్న గ్రామ పంచాయితీ వర్కర్లు-ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెజవాడ రాము

Share it:

 


శ్రమ దోపిడీకి గురవుతున్న గ్రామ పంచాయితీ వర్కర్లు-ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెజవాడ రాము 

👉*కార్మికులకు 24 వేల వేతనం తో పాటు,మౌలిక సదుపాయాలు కల్పించాలి,

దమ్మపేట(ములకలపల్లి) మన్యం మనుగడ ప్రతినిధి: గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ సమావేశం ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెజవాడ రాము అధ్యక్షున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు అనేక శ్రమ దోపిడి గురవుతున్నారని,చాలీచాలని వేతనాలతో జీవనం ఎల్లాబుచ్చుతున్నారని, ప్రతి పంచాయతీ కార్మికులకు 24 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, ప్రతి కార్మికులకు 10 లక్షల ఇన్సూరెన్స్, మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా హెచ్చరించారు. పంచాయతీ కార్మికులు నిరసన కార్యక్రమం మండల, జిల్లా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్మికులను పోరాటాల వైపు మళ్ళిస్తామని ఒకటవ తారీఖు నుండి నిరసన కార్యక్రమాలు చేపడతామని వేతనాలు పెంచే వరకు నిరసన కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో పందేటి చెన్నారావు, పేరుమల రాంబాబు, ప్రభాకర్, నాగేశ్వరరావు,చిన్న సుంకుపాక ధర్మ, గొర్రెపాటి బసవయ్య,సీతయ్య, మన్మధరావు, నరసమ్మ కాక నాగమణి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: