CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆకలి కేకలు కస్తూర్బా పాఠశాలలో మెనూ పాటించని వైనం

Share it:



  • ఆకలి కేకలు
  • కస్తూర్బా పాఠశాలలో మెనూ పాటించని వైనం
  • సరైన ఆహారం లేని చదువులు మాకెందుకు?
  • టెండర్లు లేకనే ఆకలి ఇబ్బందులు.
  • విద్యార్థుల ధర్నాతో దిగివచ్చిన అధికార యంత్రాంగం.
  • విద్యార్థులకు అరటిపండ్లు అందించిన ఎంపీపీ

మన్యం మనుగడ, పినపాక:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలో గల కస్తూర్బా పాఠశాల విద్యార్థుల ఆకలి కేకలతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా కదిలింది. గత కొన్ని నెలలుగా అధికార యంత్రాంగం నిర్లక్ష్య ధోరణితో కస్తూర్బా పాఠశాల పిల్లలు ఆకలికి దూరమై, అధికారులను నిలదీశారు. టెండర్లు లేకపోవడంతో నీళ్ల చారు తోనే సరిపెడుతూ, విద్యార్థులు పాఠశాల అందించే ఆహారాన్ని తినలేక పస్తులు ఉన్నారు. పాఠశాల ప్రత్యేక అధికారి అరుణ తనకు వచ్చే అరకొర జీతంతో కొన్ని నెలల వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సాయం లభించినప్పటికీ, విద్యార్థులకు ఆహారం అందించిందని పాఠశాల విద్యార్థులు తెలిపారు. పై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, టెండర్లు వస్తాయని, పిల్లలకు మంచి ఆహారం అందుతుందని పలుమార్లు చెప్పారని అన్నారు. ఈ కారణంగానే మంచి ఆహారం అందించే వరకు ధర్నా చేస్తామని పాఠశాల విద్యార్థులు ఆవరణలో కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, తహసిల్దార్ విక్రమ్ కుమార్ పాఠశాలకు వెళ్లి, విషయం తెలుసుకొని వెంటనే వారి ఆహారానికి కావలసిన  సరుకులను తెప్పించడం జరిగింది. పై అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి పరిష్కరిస్తామని ఎంపీపీ గుమ్మడి గాంధీ హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు ధర్నాను విరమించారు. విద్యార్థుల ఆకలి కొంతవరకైనా తీర్చేందుకు ఎంపీపీ గుమ్మడి గాంధీ అరటి పండ్లను తెప్పించి విద్యార్థులకు అందించడం జరిగింది. సామాజిక మాధ్యమాల ద్వారా, పాఠశాల అధ్యాపకుల ద్వారా విషయం తెలుసుకున్న జి సి డి ఓ జీడి అన్నామని పాఠశాలకు వచ్చి విద్యార్థులను సముదాయించగా, విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వలన చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, కొంతమంది ఇళ్లకు వెళ్లిపోయారని తెలియజేశారు. చదువుపై శ్రద్ధ కనబరచాలంటే, సరైన ఆహారం తింటేనే సాధ్యమవుతుందని జి సి డి ఓ కు విద్యార్థులు తెలియజేశారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ, రెండు రోజుల తర్వాత నుండి మెనూ ప్రకారం భోజనం అందిస్తామని, ప్రస్తుతానికి కావాల్సిన సరుకులను 

ఎస్ ఓ అరుణ కు ఇప్పించడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: