CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీల హక్కులు సాధించుకోవాలి.

Share it:

 


దమ్మపేట ఆగస్టు 09 ( మన్యం మనుగడ ) : ఆగస్టు 9 ను ఆదివాసీ హక్కుల దినోత్సవం గా,కేంద్ర ఆదివాసీ వ్యతిరేక దొరణులకు నిరసనగ దమ్మపేటలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సధస్సులో ప్రజాపంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపుడి రాము మాట్లాడుతూ ఆగస్ట్ 9 ఆదివాసీ హక్కుల దినోత్సవం.ఆదివాసులకు ఎన్నో పోరాటాల ఫలితంగా హక్కులు లభించాయి.అటవీ హక్కుల చట్టం,1/70 చట్టం ,రాజ్యాంగంలో 5 షెడ్యూల్ వారికి కొంత ఉపశమనం కలిగించాయి

    మన దేశంలో, రాష్ట్రం లో అటవీ హక్కుల చట్టం ను అరకొరాగా అమలు చేశారు.పొడు భూములకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వకుపోగా ,ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసులు కలిసి పోడు సాగుదాగుదారులపై చేస్తున్న దాడులు, దౌర్జన్యాలు వలన అడవి ( ఏజెన్సీ) ప్రాంతంలో అలజడి,ఆందోళనలు సాగుతున్నాయి.అడవి మీద ఆదివాసుల హక్కులను ప్రక్కన పెట్టీ,కార్పొరేట్ కంపనీ లకు కొల్లగొడుతూ ఆదివాసీ,గిరిజనులను కేంద్ర,రాష్టృ ప్రభుత్వాలు నిర్వాసితులను చేస్తున్నాయి అని అన్నారు

      ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టానికి సవరణలు ప్రతిపాదించింది.ఇవి పూర్తిగా ఆదివాసులకు వ్యతిరేక మైనవి,వారి హక్కులను హరించేవి

     ఇటీవల ఏజెన్సీ చట్టాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని,రాష్ర్టంలో పోడు దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి పట్టా హక్కులు ఇవ్వాలని ప్రభుత్వని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకురాలు తొడం దుర్గమ్మ,పిడిఎస్ యూ రాష్టృ నాయకురాలు సంధ్య మండల నాయకులు తాటి సత్యం, లక్ష్మి, బండి ఆదినారాయణ, లింగాలపల్లి మాజీ సర్పంచ్ సున్నం లక్ష్మి వాడె గిరి చాపా ముత్యాలు, కీసరీ వెంకటేష్ రాజమ్మ,కాక రాజు తదితరులు పాల్గోనారు.

Share it:

TS

Post A Comment: