CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నియోజక వర్గంలో పలు సమస్యలను పరిష్కరించమని కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించిన జడ్పిటిసి సున్నం నాగమణి

Share it:

 

మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ములకలపల్లి టిపిసిసి మరియు జడ్పిటిసి మెంబర్ సున్నం నాగమణి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. దానిలో భాగంగా జడ్పిటిసి మాట్లాడుతూ నియోజకవర్గం లో ఉన్న సమస్యలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కి  అశ్వారావుపేట నియోజక వర్గ హెడ్ క్వార్టర్లో సబ్- కోర్టు, ఆర్టిఓ ఆఫీస్ మరియు సబ్ రిజిస్ట్రారు ఆఫీసులు ఏర్పాటు చేయాలని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. అశ్వారావుపేట, దమ్మపేట మండల ప్రజలు గతంలో అశ్వారావు పేట నుంచి సత్తుపల్లి 35 కిలోమీటర్లు దూరంలో సబ్ కోర్టు, ఆర్టిఓ ఆఫీస్ మరియు సబ్-రిజిస్ట్రారు కార్యాలయాలు ఉండేవని ఇప్పుడు కొత్తగూడెంకు మార్చటంతో సుమారు 100 కిలో మీటరులు దూరం వెళ్ళవలిసి వస్తుందని, అశ్వారావుపేట, దమ్మపేట ప్రజలు కొత్తగూడెం వెళ్ళాలంటే సరైన రవాణా సౌకర్యం కూడా లేదని అశ్వారావుపేట, దమ్మపేట మండలాలు పూర్తిగా ఆదివాసీ గిరిజనులు నివసిస్తున్న ఏజెన్సీ ఏరియా అని విద్య మరియు వైద్య కమిటీ మెంబర్ అయినా సున్నం నాగమణి అశ్వారావుపేట మండలంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో  మౌలిక వసతులు మైనారిటీ గురుకుల స్కూలు, మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర పాఠశాలలో మౌలిక వసతులు  లేవని చెప్పటం జరిగిందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నియామకాలు లేవని స్కూల్స్  లో టీచర్ ల కొరత ఉందిని, మధ్యాహ్న భోజనం వంట మనుషులు కనీసం జీతాలు కూడా ఇవ్వటం లేదని, మధ్యాహ్న భోజనం పథకం బిల్లు లు 4-5 లక్షల వరకు  పెండింగ్ లో ఉన్నాయని  చెప్పటం జరిగిందని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్  సానుకూలంగా స్పందించి స్కూల్స్ సమస్యలను తప్పకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వటం జరిగిందని అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో సబ్ కోర్టు, ఆర్టీవో ఆఫీసు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పడం కూడా జరిగిందని తెలిపారు. దీనికి కూడా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేస్తానని చెప్పటం జరిగిందని ఆమె తెలిపారు.

Share it:

Post A Comment: