CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం.... సీజనల్ వ్యాధుల పట్ల ఆప్రమత్తంగా ఉండాలి డాక్టర్ పర్షియా నాయక్

Share it:



మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండల పరిధిలోని చిరమళ్ళ గ్రామపంచాయతీ లో ఆశ్రమ పాఠశాల నందు ప్రభుత్వ వైద్యాధికారి పర్షయ నాయక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.ఆశ్రమ పాఠశాల ఆవరణమంతా పరిశీలించి ప్రధానోపాధ్యాయులు జగన్ కు తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ దోమలను కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు పాఠశాలలో 76 మందికి చెక్అప్ చేసి మందులు అందించామని జ్వరం వస్తున్న ఆరుగురిని వైద్య పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్, ఏఎన్ఎం.రమాదేవి,అరుణ్ బాబు, ఉపాధ్యాయులు రామారావు, సంపత్, రాములు,వైద్య సిబ్బంది పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: