CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి గూడెంలో దోమతెరలు పంపిణీ

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఆదివాసి గ్రామాలైన పిట్టతోగు తిర్లాపురంలలో హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖకు చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అమృత 61 కుటుంబాలకు దోమతెరలను ఇవ్వడం జరిగింది. ఈ దోమతెరలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ రవి,సామాజిక కార్యకర్త శ్రీనివాస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , జనావాసాలకు దూరంగా ఉంటూ, సౌకర్యాలు ఏమి లేక బాధపడుతున్న సమయంలో దోమతెరలను చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, ఇరు గ్రామాలకు చెందిన ఆదివాసులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: