CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజెన్సీ ప్రాంతంలో పుట్టిన దళితులకు కూడా ఏజెన్సీ రిజర్వేషన్స్ వర్తింప చేయాలి.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

ఏజెన్సీ దళితుల సేవా సంఘంఆధ్వర్యంలో ములుగు జిల్లా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో సభ అధ్యక్షత గా జిల్లా ఇంచార్జి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్ వహించగా ఏడిఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థక అధ్యక్షుడు దుర్గం రమణయ్య పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో దళితులకు పుట్టిన భూమిపై హక్కులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, పోడు భూములకు హక్కు పత్రాలు 2006 చట్టం ప్రకారం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..

 సెప్టెంబర్ నెలలో ములుగు జిల్లా కేంద్రంలో దళిత సమస్యలపైన బారి ర్యాలీ చేపట్టడం జరుగుతుంది తెలియజేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వన్ని కోరారు.

  ఈసమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్, గౌరవ నాయకులు కోగిల మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల సమ్మయ్య,ఏటూరునాగారం సబ్ డివిజన్ అధ్యక్షుడు చిట్యాల రాజశేఖర్, ఏటూరునాగారం మండల అధ్యక్షుడు మామిడి రాంబాబు,తాడ్వాయి మండల అధ్యక్షుడు లంజపలి వెంకటేష్, ములుగు అధ్యక్షుడు ల్యదల ప్రవీణ్, పరికి నరసింహారావు, ఏజెన్సీ దళితుల సేవా సంఘం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: