CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం - రైతుల పాలిటి శాపంగా మారింది - రెండు సంవత్సరాలుగా అందని రైతుబంధు

Share it:  • రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం 
  • - రైతుల పాలిటి శాపంగా మారింది 
  • - రెండు సంవత్సరాలుగా అందని రైతుబంధు


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:


రెవిన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైల్వే కింద భూములు కోల్పోవడమే కాకా  మిగిలిన భూములకు రైతుబంధు అందక గత రెండు సంవత్సరాలుగా రెవిన్యూ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 234, 224, 158, 159, 194/ఆ/1, నెంబర్లలోని రైతుల భూములు రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల కోసం అధికారులు కొంతమేర భూములను తీసుకున్నారు. మిగిలిన భూములకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతు బంధు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై సోమవారం రెవిన్యూ కార్యాలయం లో తహశీల్దార్ వర్షా రవికుమార్ ను రైతులందరూ కలిసి రైతులందరికీ దళిత బందు వచ్చేలా చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సత్తుపల్లి రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చామని. మా భూములు కొంత మేరకే పోయాయని మిగిలిన భూములకు రైతుబంధు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాచినేని సురేష్ 234 సర్వే నెంబర్ 3.20 ఎకరాలు భూమి ఉండగా 1.8 ఎకరాలు రైల్వే అధికారులు తీసుకున్నారు మిగతా 2.2 ఎకరాలకు రైతుబంధు వర్తించడం లేదు. మాచినేని వెంకటమ్మ 234 సర్వేనెంబర్ లో 3 ఎకరాల భూమి ఉంది 1.15 గుంటల భూమి రైల్వే అధికారులు తీసుకోగా 1.25 ఎకరాలకు రైతుబంధు వర్తించడం లేదు. నరుకుల్ల ముత్తయ్య 224 సర్వే నెంబర్ లో 1.1 కుంటలు భూమి ఉండగా తొమ్మిది కుంటలు రైల్వే అధికారులు తీసుకున్నారు 32 కుంటల భూమికి రైతుబంధు వర్తించడం లేదు. 158 సర్వే నెంబర్ లో 1.8 కుంటల గాను 16 కుంటలు రైల్వే అధికారులు తీసుకోగా 32 కుంటలకు రైతుబంధు వర్తించడం లేదు. నరుకుల్ల వీరయ్య 224 సర్వేనెంబర్ లో 24 కుంటలు భూమి ఉండగా 4 కుంటలు రైల్వే అధికారులు తీసుకున్నారు. మిగిలిన 20 కుంటలకు రైతు బంధు వర్తించడం లేదు. నరుకుల్ల అశోకు 159 సర్వే నెంబర్లు 4.29 ఎకరాల భూమి ఉంది అందులో 18 కుంటలు రైల్వే అధికారులు తీసుకున్నారు. మిగిలిన  4.11 కుంటల భూమికి రైతుబంధు వర్తించడం లేదు. నరుకుల్ల నాగలక్ష్మి 194/ఆ/1 సర్వే నెంబర్ లో రెండు ఎకరాల భూమి రైల్వే ట్రాక్ లో పోలేదు అయినా కూడా రైతుబంధు తీసేసారు. ఇలా మిగిలిన భూములకు రైతుబంధు వర్తించడం లేదని గతంలో ఉన్న తహసిల్దార్ కు ఎన్నోసార్లు వినతిపత్రం అందజేశామని. అయినా కూడా స్పందన లేదన్నారు ఇప్పటికైనా తమ భూములకు రైతుబంధు వర్తింపజేయాలని వేడుకున్నారు

Share it:

TELANGANA

Post A Comment: