CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

Share it:



  •  ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
  • తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం..సీడీపీఓ రోజరాణి
  • డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు.. సూపర్వైజర్ కె.విజయలక్ష్మీ
  • తల్లిపాలే బిడ్డలకు శ్రీరామరక్ష.. ఎంపీటీసీ వేముల భారతి
  • అంగన్వాడీ కేంద్రం లో గర్భిణులకు శ్రీమంతాలు,  అన్నప్రాసన వేడుకలు.
  • హాజరైన ప్రజాప్రతినిధులు...ఆకట్టుకున్న ఆట బొమ్మలు

మన్యం మనుగడ, అశ్వారావుపేట: తల్లి పాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. తల్లిపాల వారోత్సవాలను మంగళవారం అశ్వారావుపేట లో మొదటి సెగ్మెంట్ పరిధిలో గల తూర్పు బజారు, చిన్నంశెట్టిబజార్, దూదేకుల బజారు, అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆరుగురు గర్భిణులకు సీమంతం చేసి పసుపు కుంకుమ అందజేశారు మరియు ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమం లో చిన్నారులను అలరించే విధంగా కూరగాయలతో తయారుచేసిన కొన్ని జీవప్రాణి బొమ్మలు సైతం ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా సీడీపీఓ రోజరాణి మాట్లాడుతూ చూడముచ్చటైనా ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ టీచర్స్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని చేయడం సంతోషాన్నిచ్చిందని, ఆమె గర్భిణీ స్త్రీలు పౌష్ఠిక ఆహారం తప్పకుండా తీసుకోవాలని, తల్లి పాలును మించిన ఆహారం మరొకటి లేదని, తల్లి పాల వల్ల పిల్లలకు రోగానిరోధక శక్తి పెరుగుతుందని ప్రతి ఒక్క తల్లి ముర్రిపాలు పట్టించాలని ఆమె అన్నారు. ఈ సందర్బంగా సూపర్వైజర్ కె.విజయలక్ష్మీ మాట్లాడుతూ పుట్టినవెంటనే ముర్రుపాలు ఇచ్చుటవలన బిడ్డకు వ్యాధినిరోక శక్తి ఎక్కువగా వుంటుదన్నారు. ముఖ్యంగా తల్లులు బిడ్డలకు పాలిచ్చుట ద్వారా రొమ్ము క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించవచ్చన్నారు. ఎంపీటీసీ వేముల భారతి మాట్లాడుతూ తల్లి పిల్లల క్షేమం కోరుతూ నిరంతరం వారికోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కు ధన్యవాదములు తెలియజేసారు. అలాగే ఈ కార్యక్రమంలో చిన్నారులను అలరించే విధంగా కూరగాయలతో తయారుచేసిన కొన్ని జీవప్రాణి బొమ్మలు సైతం ఆకట్టుకున్నాయని వాటిని చూస్తే పిల్లలపై టీచర్స్ కి ఉన్న అంకిత భావం గొప్పదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ రోజరాణి, సూపర్వైజర్ కె.విజయలక్ష్మీ, ఎంపీటీసీ వేముల భారతి, వార్డ్ మెంబెర్స్ యం డి, రెహానా బేగం, యూ యస్ ప్రకాష్, జ్యోతి, ఉష, రాజేశ్వరి, శిరీష, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

HEALTH

TELANGANA

Post A Comment: