CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా 75 వ భారత దేశ వజ్రోత్సవ,స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో అంకిత్ ఐఏఎస్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలమే భారతావానికి స్వతంత్రం వచ్చిందని ఆయన అన్నారు. మనమందరం సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సిబ్బందితోపాటు ప్రజలకు అయిన సూచించారు.ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక సంస్కృతిక సంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజన తెగలను విద్య,వైద్యం రంగాలలో అభివృద్ధికి కృషి చేస్తూ ఆరోగ్య సంరక్షణ చర్యలు విస్తృతంగా పరిచే వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఏటూరు నాగారం ఐటీడీఏ ఎంతో కృషి చేస్తుందని అన్నారు.గత నెలలో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత గ్రామాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునర్వాస కేంద్రాలు ఉంచి వారికి ఉచిత భోజనం కల్పించడం కూడా జరిగిందని అన్నారు.వరద ముప్పు గురైన కుటుంబాలకు 25 కేజీల బియ్యంతో పాటు 11 రకాల నిత్యవసర కిట్టులను అందించినట్టు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరంలో ఆశ్రమ పాఠశాలలు వసతి గృహంలో గురుకులాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులు 2,376 మంది విద్యార్థులు ఉత్తీర్ణ అయ్యారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు 2022 విద్యాసంవత్సరానికి అన్ని ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధించడం జరుగుతుందని అలాగే ప్రతి ఆశ్రమ పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియం లో బోధించుటకు శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగిందని అన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో బిఏఎస్ పథకం కింద 2022- 23 విద్యాసంవత్సరానికి 185 మంది గిరిజన విద్యార్థి విద్యార్థులను ఎంపిక చేసి ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించడం జరిగిందని అన్నారు.ఏటూరు నాగారం ఐటిడిఏ పరిధిలో పరిధిలో ఒక జిల్లా ఆస్పత్రి,మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 128 ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని,వీటి ద్వారా ఇప్పటివరకు 775 మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని 32,999 మందికి వైద్య సేవలు అందించడం జరిగిందని అన్నారు.ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని అన్నారు.వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధులను ఎదుర్కొనేందుకు ముందస్తుగా మూడు నెలలకు సరిపడా నిత్యవసర మందులను సామాజిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, సబ్ సెంటర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముప్పునకు గురైన 109 గ్రామాలలో 348 వైద్య శిబిరాలు నిర్వహించి 18,893 మందికి చికిత్స అందించి మందులు అందజేయడం జరిగిందని అన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో గిరిజన భవనములు,బీటీ రోడ్స్, స్కూల్స్,వసతి గృహంలో మరమ్మతులు చేయించడం జరిగిందని,నేషనల్ హెల్త్ కమిషన్ పథకం కింద 2020-21 సంవత్సరంనకు గాను 48 సబ్ సెంటర్స్ బిల్డింగ్ మంజూరు అయినాయని, వీటిలో 28 పనులు ప్రగతిలో ఉన్నాయని అన్నారు.ఐటిడిఏ ద్వారా యూత్ ట్రైనింగ్ సెంటర్ ఏటూరు నాగారం, జాకారం,కాటారం,వరంగల్ నందు నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ,ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు.ఐటీడీఏ ద్వారా గిరిజన మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయడం జరిగిందని ములుగు జిల్లాలో 25 మహబూబాబాద్ జిల్లాలో 15 సొసైటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ సొసైటీలను పేసా

కమిటీ సమన్వయకర్త ద్వారా సమన్వయం చేయడం జరుగుతుందని అన్నారు. గిరిజన సహాయనిధి పథకం కింద గిరిజనులకు ట్రైబల్ రిలీఫ్ ఫండ్ పథకం కింద 2022 సంవత్సరమునకు 46 మంది గిరిజనులకు 14 లక్షల 72, 551 ఇప్పటి వరకు అందించడం జరిగిందని అన్నారు.అటవీ హక్కుల చట్టం పథకం కింద ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులకు రైతుబంధు పథకం కింద ఏటూరు నాగారం ఐటిడిఏ ద్వారా 17వేల ఆరు మంది రైతులకు ఎకరాకు 5000/ చొప్పున వర్తించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు.గిరిజన సహకార సంస్థ ద్వారా 2021- 2022 వరకు 116. 28 లక్ష్యాల విలువ గల అటవీ ఉత్పత్తులు సేకరించి గిరిజన కుటుంబాలకు లబ్ధి కల్పించడం జరిగిందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ ద్వారా 2021- 22 వరకు 9913.21 కోట్ల విలువగల వ్యవసాయ ఉత్పత్తుల సేకరించి గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చే నైనదని అన్నారు.ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాంతంలో గిరిజనులకు ఉపయోగపడే విధంగా మారుమూల గిరిజన ప్రాంతాలలో ఐఓసీఎల్,హెచ్ పిసిఎల్, బిపిసిఎల్ కంపెనీల సహకారంతో 11 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడమైనదని,ములుగు జిల్లాలో ( 7) బంకులు, మహబూబాద్ జిల్లాలో ( 4) బంకులు ఏర్పాటు చేయడమైనదని,ఇంకా (2) మంగపేట జాకారంలోని బంకులు ప్రతిపాదనలు ఏర్పాటు దశలో ఉన్నాయని అన్నారు.అనంతరం వివిధ శాఖలలోని ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ వసంతరావు,డిటిడిఓ పోచం,ఏవో దామోదర స్వామి,ఎస్ ఓ రాజ్ కుమార్, మేనేజర్ శ్రీనివాస్,ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ హేమలత,ఐటీడీఏ వివిధ సెక్టార్ల అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: