CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్వాతంత్ర్య వచ్చి 75 ఏండ్లు అయిన దళితులపై ఆగని దాడులు

Share it:  •  స్వాతంత్ర్య వచ్చి 75 ఏండ్లు అయిన దళితులపై ఆగని దాడులు 
  • మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి

మన్యం మనుగడ, మంగపేట.

 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో మంచి నీళ్ల కోసం చావులా... నీళ్ల కుండ ముట్టుకుంటే దళిత విద్యా ర్థిని కొట్టి చంపిన ఉపాధ్యాయుడు ఆ దుర్మార్గుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలి అంటరాని తనం కుల వివక్ష రాజ్యమేలుతోంది 75 ఏళ్లు గడిచినా మారని బడు గుల బతుతులు ఏం సాధించామని ఈ ఆజాదికా అమృత్ మహో త్సవాలు  వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న శుభ సందర్భంగా దేశంలో ఆజాదికా అమృత్ మహోత్సవాలు దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఇప్పటి వరకు దళితుల మీద దాడులు అవమానాలు, కుల వివక్షతకు గురై ఎన్నో రకాల ఇబ్బం దులు పడుతున్నారని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి అన్నారు.ఆదివారం మంగపేట మండలం రాజుపేటలో ఏర్పాటు చేసి సమావేశంలో ఆయన  మాట్లాడుతూ ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో బడుగు జీవుల బతుకులు మాత్రం మార్పు రాలేదు ఇంకా కులవివక్ష అంటరానితనం కుల రక్కసి రాజ్య మేలుతూనే ఉందని రాజస్థాన్ లో గ్లాస్ మంచి నీళ్లు తాగేందుకు కుండను ముట్టు కున్నాడని కులోన్మాద ఉపాధ్యక్షుడు చైల్ సింగ్ చేతిలో దెబ్బలు తిని ప్రాణాలు వదిలిన సంఘటన రాజస్థాన్ లోనీ జలోర్ జిల్లా సురా నా గ్రామానికి చెందిన దళిత బాలుడు ఇంద్ర కుమార్ మేఘ్వాల్ (9) స్కూలులో కుండలో నీళ్లు తాగాడని కులోన్మాది అయిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని తీవ్రంగా కొట్టడంతో తీవ్రంగా రక్త ప్రసవం కావడంతో చికిత్స పొందు తూ విద్యార్థి చనిపోయిన ఘటన దారుణం అన్నారు.ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఈ దుర్మార్గానికి పాల్పడిన ఆ ఉపాధ్యా యుడిని బహిరంగంగా ఉరి తీయాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్  డిమాండ్ చేస్తున్నాం అన్నారు.అదే విదంగా తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో దళిత మహిళా సర్పంచ్ పై గ్రామ కార్యదర్శి విచక్షణ రహితంగా కొట్టడం చాలా దారుణం అని దళితులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న కుల వివక్షతకు గురై అవమా నాలు ఎదుర్కొంటున్నారని దళితుల పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: