CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గురువారం ఉదయం 6 గంటలకు నిర్వహించే 2 కే రన్ విజయవంతం చేయండి - తహశీల్దార్ వర్ష రవికుమార్

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:

75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం చండ్రుగొండ మండల కేంద్రంలో నిర్వహించే 2కే రన్ విజయవంతం చేయాలని తహసిల్దార్ వర్ష రవికుమార్ మండల ప్రజలను కోరారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలు నిర్వహణపై మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 15 రోజులపాటు దేశవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని అందులో భాగంగా గురువారం 11 తేదీన ఉదయం 6 గంటలకు చండ్రుగొండ మండల కేంద్రంలోని అయ్యన్నపాలెం పెద్దమ్మ తల్లి ఆలయం నుండి బస్టాండ్ సెంటర్ లోని గాంధీ విగ్రహం వరకు 2కే రన్ నిర్వహిస్తున్నామని. ఈ ర్యాలీలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, కార్మికులు, గ్రామస్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఆగస్టు 16వ తేదీన నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఏకకాలంలో ఎక్కడి వారు అక్కడే నిలబడి జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. 17వ తేదీన అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రక్తదానంలో పాల్గొనేవారు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలా ఈ 15 రోజులు వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలు పాల్గొని తమ దేశభక్తిని చాటి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భానోత్ పార్వతి, ఎంపీడీవో డి అన్నపూర్ణ, సబ్ ఇన్స్ స్పెక్టర్ గొల్లపల్లి విజయలక్ష్మి, ఎంఈఓ సత్యనారాయణ, ఎంపీఓ తోట తులసీరామ్, ఎంపీటీసీలు దారా వెంకటేశ్వరరావు, లంక విజయలక్ష్మి, మండల రైతు కోఆర్డినేటర్ గాదె లింగయ్య, గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్ రావు, మండల కో ఆప్షన్ సభ్యులు ఇమామ్, ఉపసర్పంచ్ దిబ్బెందుల బాబురావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బొర్రా సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: