CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.24 గంటలు గిరిజనుల సేవలో ఐటీడీఏ,గిరిజనాభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ నిత్యం గిరిజన సంక్షేమం కోసం పనిచేస్తుందని ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు.

Share it:


  • వైద్యం,సంక్షేమంతో పాటు రాజ్యాంగ హక్కులు-చట్టాలను అమలు చేస్తామన్న ఐటీడీఏ పీవో అంకిత్.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని అధికారికంగా ఐటీడీఏ ఏటూరు నాగారం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు వై జంక్షన్ నుండి నాయక పోడుల ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవరాలతో ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఐటీడీఏ పీవో అంకిత్ ఐఏఎస్ హాజరు కాగా ఐటీడీఏ ఆదివాసి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఐటీడీఏ పైసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ అధ్యక్షత వహించారు.ఐటీడీఏ పీవో ముందుగా కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించగా,ప్రపంచ ఆదివాసి జెండాను ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఐటీడీఏ సమావేశపుల హల్ల్ లో జరిగిన సమావేశంలో ఆదివాసీ సంఘాల నాయకులు పొడేం రత్నం మాట్లాడుతూ. ఐదో షెడ్యూల్ భూభాగంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు చట్టాలు అమలు జరిగే విధంగా అన్ని శాఖల సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.ఏజెన్సీలో హక్కులు చట్టాలపై ఆదివాసి ప్రజలకు అవగాహన కొరకు గుడాలలో నిరంతర అవగాహన సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.దశాబ్దాలుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్నా పోడు భూములపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలన్నారు ఏజెన్సీలో జీవో నెంబర్ 57 ప్రకారం సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ను అమలు చేయాలని ప్రజాసంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో కోరారు.స్థానిక సర్పంచ్ ఆదివాసీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈసం రామ్మూర్తి మాట్లాడుతూ ఏటూరు నాగారం ఐటిడిఏ పరిధిలో వృత్తి నైపుణ్యత శిక్షణ కళాశాలలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఐటీడీఏ పీవోను కోరారు. ఆదివాసి ప్రాంతాలలో 60 శాతం యువత డిగ్రీ,పేజీ లు చదివి ఉద్యోగ అవకాశాలు లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారని,వీరికి ఐటీడీఏ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఆర్టికల్ 275 ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా ఐ టి డి ఏ కు వచ్చే విధంగా కృషి చేయాలని సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఐటీడీఏను బలోపేతం చేయాలన్నారు.పెసా గ్రామ సభల తీర్మానం మేరకే అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.పేసా గ్రామసభలు ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే విధంగా ఎంపీడీవోలకు ఆదేశించాలని,ఈ సందర్భంగా ఐటీడీఏ పీవోను కోరారు. ఏజెన్సీలో పనిచేస్తున్న 29 ప్రభుత్వ శాఖల ను ఐటిడిఏ గొడుగు క్రింద పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఏపీవో వసంతరావు,ఏవో దామోదర్ స్వామి,ఎస్ వో రాజ్ కుమార్, ఐటీడీఏ మేనేజర్ శ్రీనివాస్, ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ హేమలత, డిఇ నవీన్ కుమార్,ఏసీఎంవో రవీందర్,పి హెచ్ ఓ రమణ,పి ఎ ఓ లక్ష్మీ ప్రసన్న,ఏ డి హెచ్ భారతి,ఆదివాసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు పోదెం కృష్ణ ప్రసాద్,చెరుకుల ధర్మయ్య,కోటి రవి,మైపతి సంతోష్,నల్లబోయిన కోటయ్య,కోరగట్ల రవీందర్, అన్నవరం వెంకటేశ్వర్లు,మల్లెల రాంబాబు,ఆదివాసి మహిళ ఉద్యోగ సంఘం నాయకులు పెనక చంద్రకళ,ఆదివాసి సంఘాల నాయకులు వట్టం నరసింగరావు,పొడెం శోభన్, వంక నరేష్,బొల్లెం సారయ్య, కోడి రాంగోపాల్,కోడి వెంకటేశ్వర్లు,ముద్దబోయిన రవి,ఎట్టి రాజబాబు, ఆదివాసి మహిళా సంఘం నాయకులు కొమురం లక్ష్మీకాంత,బడే సులోచన, ఐటీడీఏ ఆదివాసి ఉద్యోగుల సంఘం నాయకులు పెనక కృష్ణమూర్తి,కాక భాస్కర్,పెనక ప్రభాకర్,ఆర్కె కృష్ణ,ఈక కృష్ణ, ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: