CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆగస్టు14న సాంస్కృతిక సారధి కళాకారులచే పేటలో కళారూపాలు.

Share it:



మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో ఆగస్టు14న అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో జరుగబోవు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బుధవారం అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథి భద్రాద్రి జిల్లా కళాకారులు మండల పరిషత్ అధికారి విద్యాధరరావు తో సమావేశంఅయ్యారు. సమావేశంలో సాంస్కృతిక కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ లీడర్ నకిరికంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కళాకారుల చేత అశ్వారావుపేటలో వివిధ కళారూపాలలో ఆట, పాటలతో మరియు స్థానిక కళాకారులతో కూచిపూడి నృత్యాలు, డాన్స్ బేబీ డాన్స్, పల్లె జానపద నృత్యాలు, కోలాటాలు, కొమ్ముడోలు నృత్యాలు నృత్యాలుతో కళారూపాలు ప్రదర్శింపబడునని తెలిపారు. కావున ప్రజలు, ప్రేక్షకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సినదిగా కోరారు. సమావేశంలో ఎంపిడివో విద్యాధరరావుతో పాటు కార్యాలయ సిబ్బంది, కళాకారులు వెంకటేశ్వర్లు, సత్యవాణి, కృపానందలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: