CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మమ్ములను గుర్తించండి మహాప్రభో, మోడల్ కాలనీ వాసుల వేడుకోలు, పంచాయతీ పాలన అందడం లేదంటూ ఆందోళన -కనీస సౌకర్యాలు అడ్రస్సే లేవు -పారిశుద్ధ పనులు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం -పట్టించుకోవాలంటున్న ప్రజలు

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయి వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ మమ్మల్ని గుర్తించండి మహాప్రభో అంటూ మండల పరిధిలోని పేరాయి గూడెం గ్రామపంచాయతీకి చెందిన మోడల్ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 2005 నుండి మోడల్ కాలనీ నివాసం ఉంటున్నామని, పేరుకే మోడల్ కాలనీ తప్ప ఇక్కడ ఎటువంటి మోడల్ లేదని, వర్షం వస్తే చెరువుల్ని తలపిస్తున్న వీధులు, ఇళ్లల్లోకి వరద నీరు ఉప్పెనలా వస్తున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యారని, వర్షాలకు తడికలు గోడలు పడిపోయి, వరద నీరు ఇళ్ల మధ్య నుండి ప్రవహిస్తూ, చెత్తాచెదారం ఎక్కడికక్కడే నిలిచిపోయి రోగాలు రొచ్చులు భరిస్తున్నా కాపాడే నాధుడే లేడని మోడల్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలు వచ్చి భద్రాచలం మునిగితే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ముంపు బాధితులను పరామర్శించారని, మోడల్ కాలనీలో వర్షాలకు చెరువులను తలపిస్తుంటే కనీసం చూసిన దాఖలాలు లేవని, ఇదంతా చూస్తుంటే మేము పెరాయిగూడెం పంచాయతీలో ఉన్నామా లేదా అనే అనుమానం కూడా కలుగుతుందని గ్రామపంచాయతీ వారికి మేము గుర్తున్నామో లేదో అని పంచాయతీ పాలన పట్ల కాలనీవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.*డ్రైనేజీ వ్యవస్థే లేదు* మోడల్ కాలనీ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇంతవరకు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదని, కచ్చా డ్రైనీజీలు కూడా ఏర్పాటు చేయలేదని, దీంతో వర్షం వచ్చినప్పుడల్లా వరద ప్రవాహం ఇల్ల మీదకు వచ్చి కాలనీ మొత్తం చెరువుల్ని తలపిస్తుందని, నడవడానికి సక్రమంగా రోడ్లు కూడా లేవని, ఒక్క సిమెంటు రోడ్డు కూడా వేయలేదని,ఎన్నిసార్లు గ్రామపంచాయతీ అధికారులకు ప్రజా ప్రతినిధులకు చెప్పినప్పటికీ ఫలితం శూన్యమని కాలనీవాసులు వాపోతున్నారు.*విష జ్వరాలు సోకుతున్నా పట్టించుకునే నాధుడే లేడు* మోడల్ కాలనీలో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోవడం వలన దోమలు విపరీతంగా పెరిగి విష జ్వరాల బారిన పడుతున్నా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వీధుల్లో బ్లీచింగ్ చల్లించుట గాని, చెత్తను తొలగించే పనులు కానీ చేయడం లేదని, మేము అసలు పెరాయిగూడెం పంచాయతీలో ఉన్నామా లేమా అనే అనుమానం కలుగుతుందని, గ్రామపంచాయతీ ఏర్పడ్డ నాటి నుండి ఈనాటి వరకు మా మోడల్ కాలనీలో పారిశుద్ధ్య పనులే జరగలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు, అనేకసార్లు ఈ విషయాలపై గ్రామపంచాయతీ కార్యదర్శి సర్పంచులకు విన్నవించిన ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు.*మా ఓట్లు కావాలి కానీ మా అభివృద్ధి అవసరం లేదా* ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి దండాలు దస్కాలు పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే ఒక్కసారైనా అమ్మ కాలనీకి వచ్చి మా బాగోగులు చూశారా? ఎమ్మెల్యే మా కాలనీకి వస్తే మా సమస్యలు ఏంటో అర్థం అవుతాయి, ఎమ్మెల్యే మా మోడల్ కాలనీ కు రావాలి అంటూ ప్రజలు మీడియా ముందు వారి బాధలు వెల్లబుచ్చుకున్నారు.*రోడ్ల పరిస్థితి మరీ అద్వాన్నం* మోడల్ కాలనీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ప్రతిసారి కురిసే వర్షాలకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన రోడ్లపై ఉన్న మట్టి కొట్టుకుపోయి కంకర తేలి నడవడానికి వీలు లేకుండా తయారయ్యాయని, మోడల్ కాలనీలోకి ఎవరైనా రావాలి అంటే అమ్మో మోడల్ కాలనీ రోడ్లు అంటూ భయపడుతున్నారని ప్రభుత్వం దృష్టి సారించి రోడ్లు బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.*మాకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలి* మోడల్ కాలనీలో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటి నుండి ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాం కానీ మాకు ఇళ్ల పట్టాలు లేవని, అనేకసార్లు గ్రామపంచాయతీ అధికారులకు, రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నామని, అయినా ఫలితం లేదని, ఇప్పించాలని మోడల్ కాలనీవాసులు కోరుతున్నారు. *ఉన్నతాధికారులు దృష్టి సారించాలి* అశ్వరావుపేట మండలంలోని పేరాయగూడెం గ్రామపంచాయతీలో మోడల్ కాలనీ వాసులము అనేక సమస్యలతో సతమతమవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గ్రామపంచాయతీ పాలన మాకు లభించడం లేదని, అరకొర సౌకర్యాలతో హతమతమౌతూ జీవనం కొనసాగిస్తున్నామని, రోడ్డు సౌకర్యం, డ్రైనేజీ సౌకర్యాలు సరిగా లేవని, పారిశుద్ధ్య పనులు కూడా జరగడంలేదని, చెత్త ఎక్కడ వేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని పేరుకే మోడల్ కాలనీ కానీ, కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని ఉన్నతాధికారులు దృష్టి సారించి మా సమస్యలను పరిష్కరించాలని, లేనిచో ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపారు.*గ్రామ కార్యదర్శి వివరణ* ఈ విషయమై గ్రామ కార్యదర్శి ని వివరణ కోరగా గ్రామపంచాయతీలో సిబ్బంది కొరత ఉందని, ఉన్నటువంటి వర్కర్స్ కొన్ని పనులు వెనుక పడుతున్నాయని ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, రోడ్లు డ్రైనేజీలు పాలకవర్గ తీర్మానంతో చేసే పనులని, పాలకవర్గం తీర్మానం చేస్తే వాటిని కూడా పూర్తి చేస్తామని, గతంలో రోడ్లకు గ్రావెల్ వేశారని, ఇప్పుడు గ్రావెల్ కొరత ఉండటంతో ఇబ్బందులు తలెత్తాయని, కచ్చా డ్రైన్లు జెసిబి తో తీసే ఏర్పాట్లు చేస్తామని చర్చించి వారి సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని వారు తెలిపారు.

Share it:

TS

Post A Comment: